హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బైక్ రేసర్ బీర్ బాటిల్‌తో కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. టోలిచౌకి నుండి వేగంగా వస్తున్న ఖాజా అనే బైక్ రేసర్ ఓ కారును ఢీకొట్టాడు. ఈ ఘటన బంజారాహిల్స్ ఒమేగా హాస్పిటల్స్ రోడ్డులో చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం కార్ డ్రైవర్, ఖాజా మధ్య వాగ్వాదం తలెత్తింది. అప్పుడే కానిస్టేబుల్ శ్రీకాంత్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విధుల కోసం వెళ్తున్నాడు. ఈ ఘర్షణను గమనించిన కానిస్టేబుల్ శ్రీకాంత్ వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు.
కొన్ని ఊహించని ఘటనలు.. తమ కళ్ల ముందు జరిగిన ప్రమాదాలు కొందరి మనస్సును పూర్తిగా మార్చేస్తాయి.. ఎన్నిసార్లు చెప్పినా.. చాలా సార్లు దొరికిపోయినా.. ఎందరో హెచ్చరించినా మనసు మార్చుకోని ఓ బైక్ రేసర్.. ఓ ఘటనను చూసిన తర్వాత పూర్తిగా మారిపోయాడు.. మారడంటే.. తాను ఒక్కడే మారడం కాదు.. చాలా మందిని మార్చే ప్రయత్నం మొదలు పెట్టాడు.. ప్లకార్డులు పట్టుకొని రోడ్లపైకి వచ్చాడు.. సిగ్నల్స్ వద్ద ప్రచారం చేయడం మొదటు పెట్టాడు.. ఇంతలా మారిపోయిన ఆ బైక్…