కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మిషన్ 2024 లక్ష్యంగా పోరాటాలు చేస్తామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీపీఐ జాతీయ కార్యదర్శి అమర్‌జీత్‌కౌర్ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రామికవర్గం, ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ప్రజలను రక్షించండి.. దేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు.
Read Also: కొత్త ఒక వింత .. ఈ ఆధార్ కార్డు ఉంటేనే పెళ్లికి ఎంట్రీ..!
హైదరాబాద్‌లో మూడురోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ, జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాల గురించి అమర్‌జీత్‌కౌర్ వెల్లడించారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా చేసేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ పెద్దనోట్ల రద్దును వ్యతిరేకించారని, ప్రధాని మంత్రి కాగానే ఆ నిర్ణయం ఎందుకు అమలు చేశారని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌లో విద్య, వైద్యం, తాగునీరు, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ పథకాల నిధుల్లో కోత విధించారని విమర్శలు చేశారు.