బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. 2024 లోక్‌సభ ఎన్నికలపై విస్తృత చర్చలు జరిగాయి. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ/ఎన్‌డీఏ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లోని గత మూడు నెలల నివేదిక కార్డును అందజేస్తారని, దానిపై చర్చ జరిగిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మిషన్ 2024 లక్ష్యంగా పోరాటాలు చేస్తామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీపీఐ జాతీయ కార్యదర్శి అమర్‌జీత్‌కౌర్ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రామికవర్గం, ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ప్రజలను రక్షించండి.. దేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. Read Also: కొత్త ఒక వింత .. ఈ ఆధార్ కార్డు ఉంటేనే…