రాష్ట్రంలోని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బకాయిలు విడుదల చేయకపోవడంతో నవంబర్ 3 నుంచి అన్ని వృత్తి విద్యా కాలేజీలు నిరవధిక బంద్‌లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల ఛైర్మన్ రమేష్ బాబు మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి 1,200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. “మిగతా మొత్తానికి ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, ఒక రోడ్‌మ్యాప్…
Narasapur: నర్సాపూర్ టౌన్‌లో ప్రస్తుతం జరుగుతున్న బంద్ తీవ్ర ఉద్వేగం సృష్టిస్తోంది. అఖిలపక్షం ప్యారానగర్ ప్రాంతంలో GHMC డంప్ యార్డు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చింది. ప్యారానగర్‌లో డంప్ యార్డు ఏర్పాటు చేయడంపై స్థానికుల నుంచి అనేక ఆందోళనలు వస్తున్నాయి. దీనితో స్థానిక ప్రజలంతా ఈ డంప్ యార్డుతో సంబంధించిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంప్ యార్డుతో నర్సాపూర్ రాయరావు చెరువులో వ్యర్థజలాలు కలుషితమవుతాయని తెలుపుతున్నారు. ఈ కారణంగా పంట…
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పట్టణంలో ఆక్రమిత స్థలంలో నిర్మించిన సంజౌలీ మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై పోలీసులు నిన్న (శుక్రవారం) నీటి ఫిరంగులతో పాటు లాఠీచార్జీ చేశారు. దీనికి నిరసనగా నేడు (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి.
బెంగాల్ రాష్ట్ర సచివాలయం నవన్‌కు విద్యార్థి సంఘం నిర్వహించిన మార్చ్‌లో పాల్గొన్న వారిపై పోలీసుల లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లతో అడ్డుకున్నారు. ఈ చర్యకు నిరసనగా ఇవాళ ( బుధవారం) రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ బెంగాల్‌లో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ ప్రకటించారు.
Kolkata Doctor Case: కలకత్తా వైద్యురాలు పై జరిగిన హత్యాచారం నేపథ్యంలో 24 గంటల పాటు దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్ చేయనున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసనలో వైద్యులు..
Section 144 imposed in Karnataka over Cauvery Issue: కర్ణాటకలో నేడు రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వ్యతిరేకిస్తూ.. కన్నడ, రైతు సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ బంద్‌కు మద్దతుగా హోటళ్లు, విద్యా-వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్, ప్రైవేటు సంస్థలు అన్నీ మూతబడ్డాయి. మరోవైపు బస్సులు డిపోలకే పరిమితం కాగా.. ట్యాక్సీలు, ఆటోలు కూడా నిలిచిపోయాయి. ఇక బెంగళూరు విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం 44 విమాన…
జగిత్యాల జిల్లాలో రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో జరిగిన సంఘటనపై రూరల్ ఎస్సై అనిల్ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. రేపటి జగిత్యాల పట్టణ బంద్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఆధ్యాత్మిక గురువు దలైలామా ఒక అబ్బాయిని ముద్దుపెట్టుకుంటూ, తన నాలుకను నోటితో తాకాలని బాలుడిని కోరిన వీడియో అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయితే, సోమవారం లడఖ్ లో స్థానికలు దలైలామాకు మద్దతునిచ్చేందుకు శాంతి మార్చ్‌ను చేపట్టారు.