భారత్‌లో మబరో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది.. త్రిపురలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ (ఏఎస్‌ఎఫ్) వెలుగుచూసింది.. సెపాహిజాలా జిల్లా పరిధిలోని దేవిపూర్‌లో ఉన్న జంతు వనరుల అభివృద్ధి శాఖ (ఏఆర్‌డీడీ) నిర్వహిస్తున్న ఫారమ్‌లో ఈ తరహా కేసులు గుర్తించినట్టు తెలిపారు.. దీంతో, అప్రమత్తం అయిన అగర్తలలోని నిపుణుల బృందం… ఆ ఫారమ్‌ను సందర్శించి పరిస్థితిని అంచనా వేసేందుకు చర్యలు ప్రారంభించింది.. దీనికోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. అయితే, ఈ నెల 7వ తేదీన శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ఈశాన్య ప్రాంతీయ వ్యాధి నిర్ధారణ లాబోరేటరీకి పంపగా.. 13వ తేదీన వచ్చిన పీసీఆర్ ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారించారు. ఫారమ్‌లోని పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉండడంతో.. ఫ్లూ ఫారమ్ మొత్తం వ్యాపించి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ నిర్ధారణ అయిన తర్వాత పందులను సామూహికంగా ఉరితీయాలని ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తోంది.
Read Also: Astrology: ఏప్రిల్ 19, మంగళవారం దినఫలాలు
ఇక, భోపాల్‌లోని నేషనల్ డిసీజ్ డయాగ్నస్టిక్ ఇన్‌స్టిట్యూట్ నుండి రావాల్సిన మరో నివేదిక ఇంకా రాలేదని పశుసంవర్థక శాఖ రన్ డిసీజ్ ఇన్వెస్టిగేషన్ లాబొరేటరీలోని సీనియర్ అధికారి వెల్లడించారు.. మేం ప్రతి గ్రూపులో పది మందితో కూడిన రెండు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశాం.. బృందాలకు వెటర్నరీ అధికారి నాయకత్వం వహిస్తారు.. వారు నేరుగా నోడల్ అధికారుల ప్యానెల్‌కు నివేదిస్తారని తెలిపారు. మొదటి పందులను సామూహికంగా చంపేయడం.. ఆ తర్వాత వైరస్ సోకిన పందులను పాతిపెట్టడానికి 8 అడుగుల మేర లోతైన గుంతలను తోవి అందులో పాతిపెట్టనున్నారు. దీనిపై అధికార ప్రకటనపై మీడియా ప్రశ్నించగా.. పరిశోధకులు భారత ప్రభుత్వానికి లేఖ రాస్తారు.. కేంద్రం ఈ విషయాన్ని ప్రధాన కార్యదర్శికి తెలియజేస్తుందని తెలిపారు. అధికారిక లేఖ రాష్ట్ర ప్రభుత్వానికి చేరిన తర్వాత మాత్రమే అన్ని తదుపరి ప్రక్రియలు నిర్వహించనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఇక, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 63 పందులు.. గుర్తు తెలియని కారణాలతో చనిపోయాయని.. ఆ పందుల షెడ్డులో 265 పందులు మరియు 185 పంది పిల్లలు ఉన్నాయని వెల్లడించారు.