ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. తాజాగా ఇదే అంశంపై బుధవారం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఆప్‌కు మద్దతు ఇవ్వడానికి గల కారణాలు వెల్లడించారు. ఢిల్లీలో కాంగ్రెస్ కంటే ఆప్‌నే బలంగా ఉందని.. అందుకే తమ మద్దతు ఆమ్ ఆద్మీ పార్టీకేనని వెల్లడించారు. ఎస్పీతో పాటు తృణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్ పార్టీ కూడా ఆప్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: Meta: ఉద్యోగులకు ఫేస్‌బుక్ మాతృసంస్థ షాక్.. 3600 మంది తొలగింపు..!
బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ప్రాంతీయ పార్టీలకు ఇండియా కూటమి నేతలు మద్దతు ఇవ్వాలని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నా .. ఆప్‌కే బలం ఉంది కాబట్టి మద్దతు ఇస్తున్నామన్నారు. ఢిల్లీలో బీజేపీని ఓడించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. చివరికి కాంగ్రెస్, ఆప్ టార్గెట్ కూడా అదేనని తెలిపారు. ఇండియా కూటమి ఏర్పడినప్పుడే.. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట ఆ పార్టీలకు కూటమి మద్దతుగా నిలవాలని నేతలంతా నిర్ణయించారని గుర్తుచేశారు. ఢిల్లీలో ఆప్ బలంగా ఉన్నందున తమ మద్దతు దానికేనని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Delhi Elections: సీఎం అతిషి ఆస్తులు ఎంతంటే..!
ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. నామినేషన్లకు చివరి తేది జనవరి 17 కాగా.. నామినేషన్ల పరిశీలన జనవరి 18… ఉపసంహరణకు జనవరి 20వ తేదీ చివరి రోజు కానుంది.
#WATCH | Haridwar: On the INDIA alliance, Samajwadi Party chief Akhilesh Yadav says "The INDIA alliance is intact. I remember when the INDIA alliance was formed, it was decided that wherever a regional party was strong, the alliance would extend support to them. AAP is strong in… pic.twitter.com/gjINs5aLf5
— ANI (@ANI) January 15, 2025