Delhi Elections: సీఎం అతిషి ఆస్తులు ఎంతంటే..!
- ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి నామినేషన్ దాఖలు
- అఫిడవిట్‌లో ఆస్తులు వివరాలు వెల్లడించిన అతిషి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్య నేతలంతా నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం అతిషి, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక సీఎం అతిషి కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా పోటీ చేస్తుండగా… బీజేపీ నుంచి ప్రముఖ నేత రమేష్ సింగ్ బిధురి బరిలో ఉన్నారు. ముగ్గురు నేతలు నామినేషన్లు దాఖలు వేశారు. తాజాగా అఫిడవిట్‌లో దాఖలు చేసిన ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి.
ముఖ్యమంత్రి అతిషి..
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆస్తుల విలువ రూ.76,93,347.98 ఉన్నట్లుగా పేర్కొన్నారు. గత ఐదేళ్లలో తన సంపద 28.66 శాతం పెరిగిందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎటువంటి స్థిరాస్తి లేదని తెలిపారు. ఆభరణాల పేరుతో కేవలం 10 గ్రాముల బంగారం మాత్రమే ఉందని వెల్లడించారు. సొంత కారు లేదా ఇతర ఎలాంటి వాహనం కూడా లేదని పేర్కొన్నారు. రెండు క్రిమినల్ పరువు నష్టం కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలియజేశారు. ప్రస్తుతం రూ. 30 వేల నగదు ఉందని, తనకు మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
అల్కా లాంబా…
ఇక కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా కూడా ఆస్తుల వివరాలు తెలియజేశారు. అల్కా లాంబాకు మొత్తం రూ.3.41 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.61.12 లక్షల విలువైన చరాస్తులు ఉండగా, ఆమె బంధువుకి రూ.14.36 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో రూ.20.12 లక్షలు పెరిగినట్లుగా చెప్పారు. గురుగ్రామ్‌లో రూ.80 లక్షల విలువైన 500 చదరపు అడుగుల వాణిజ్య ఫ్లాట్, ఢిల్లీలోని సౌత్ ఎక్స్‌టెన్షన్-1లో రూ.2 కోట్ల విలువైన నివాస ఆస్తి ఉంది. అఫిడవిట్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆమె ఆదాయం రూ. 8.28 లక్షలు కాగా, 2023-24లో రూ. 8.91 లక్షలు, 2022-23లో రూ. 5.35 లక్షలుగా ఉంది. ఆభరణాల గురించి మాత్రం అఫిడవిట్‌లో వెల్లడించలేదు.
రమేష్ బిధురి…
రమేష్ సింగ్ బిధురి.. కల్కాజీ నుంచి బరిలో ఉన్నారు. 2003, 2008, 2013లో తుగ్లకాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అల్కా లాంబా దాదాపు ఐదేళ్ల పాటు ఆప్‌లో ఉండి 2019లో కాంగ్రెస్‌లో చేరారు. కల్కాజీ నియోజకవర్గంలో మొత్తం 1,94,515 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,06,893 మంది పురుష ఓటర్లు, 87,617 మంది మహిళా ఓటర్లు, ఐదుగురు ట్రాన్స్‌జెండర్ ఓటర్లున్నారు. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!