Delhi: ఢిల్లీలో లోక్‌సభ అభ్యర్థుల్ని ప్రకటించిన ఆప్.. ప్లాన్ ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ ఆప్‌కు (AAP) బీజేపీకి (BJP) ఎంతో కీలకమైంది. ఇక్కడ మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నీ ప్రస్తుతం కమలం చేతిలోనే ఉన్నాయి. ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఆప్ తీవ్ర కసరత్తు చేసింది. ఇందులో భాగంగానే తాజాగా నలుగురు లోక్‌సభ అభ్యర్థులను ( Lok Sabha Polls Candidates) ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (Kejriwal) ప్రకటించారు. అయితే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఢిల్లీలో అవకాశం కల్పించారు. ఈ ముగ్గురు ఢిల్లీలో కీలకమైన నేతలు కావడం విశేషం. దీంతో ఎలాగైనా ఆ స్థానాలను కైవసం చేసుకోవాలన్న ఆలోచనతోనే సిట్టింగ్‌లు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే హర్యానాలో ఒక పార్లమెంట్ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీకి నలుగురు, హర్యానాలో ఒకరిని ప్రకటించింది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఆప్ ప్రకటించిన 4 లోక్‌సభ అభ్యర్థుల్లో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలే కావడం విశేషం.
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
ఇండియా కూటమిలో భాగంగా ఢిల్లీలో ఉన్న ఏడు స్థానాల్లో నాలుగు ఆప్‌కు, కాంగ్రెస్‌కు మూడు స్థానాలు కేటాయించారు. తాజాగా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఢిల్లీలో ఆప్ న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.
న్యూఢిల్లీకి సోమనాథ్ భారతి. మాల్వియా నగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పశ్చిమ ఢిల్లీకి మహాబల్ మిశ్రా. కొండ్లి అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక తూర్పు ఢిల్లీ నుంచి కుల్దీప్ కుమార్. తుగ్లకాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సహిరామ్ దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.
2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు ఈ స్థానాలు ఆప్‌కి చాలా కీలకం. ఇక హర్యానాలోని కురుక్షేత్ర నుంచి సుశీల్ గుప్తాను నిలబెట్టింది.
ఇక పంజాబ్‌లో మాత్రం ఆప్ ఒంటరిగా పోటీ చేస్తోందని ఇప్పటికే ప్రకటించింది. గుజరాత్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!