Operation Lotus: మరో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర..! రూ.1,375 కోట్లతో బీజేపీ ప్లాన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుసగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి.. తమ సర్కార్‌ను భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తూ వస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.. ఇక, ఈ మధ్య, మరో రెండు మూడు రాష్ట్రాల్లో పరిస్థితులను ముందుగానే ఆ రాష్ట్రాల సీఎంలు పసిగట్టి.. వారికి చెక్ పెట్టే విధంగా ఫ్లోర్ టెస్ట్ కూడా నిర్వహించారు.. అందులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒకరైతే.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మరొకరు.. అయితే, ఆ రాష్ట్రాల్లో తమ ఎత్తులో చిత్తు కావడంతో.. ఇప్పుడు మరో రాష్ట్రాంలో బీజేపీ కుయుక్తులు పన్నినట్టు.. ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.. పంజాబ్‌లోని ఆప్ సర్కార్‌ను కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి హర్పాల్ చీమా ఆరోపించారు. అంతేకాదు.. తమ సర్కార్‌ను పడగొట్టేందుకు బీజేపీ ఏకంగా రూ.1,375 కోట్లు ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ప్రయత్నించారని తెలిపారు.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
గతంలో గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఇలాంటి ప్లానే చేసిందని.. ఇప్పుడు పంజాబ్‌లోనూ అదే పని చేస్తోందని మండిపడ్డారు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా… మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను తమకు మద్దతు ఇచ్చేలా చేసే ప్రయత్నాల్లో భాగంగా.. అందులో ఏడుగురిని నేరుగా.. లేదా మూడో వ్యక్తి ద్వారా సంప్రదించారని విమర్శించారు.. మరోవైపు.. కేంద్ర నిఘా వర్గాల ద్వారా కూడా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు మొత్తం రూ.1,375 కోట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైందని సంచలన ఆరోపణలు చేశారు.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25కోట్లు ఆఫర్ చేశారని ఆరోపణలు గుప్పించారు.. కాగా, ఢిల్లీలోనూ బీజేపీపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.. అయితే, ఆప్ ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్త పడ్డ ఆ పార్టీ.. అసెంబ్లీ వేదికగా బలనిరూపణ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పంజాబ్‌లోనే ఆప్ సర్కార్‌ను బీజేపీ టార్గెట్ చేస్తుందని.. ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!