Uttar Pradesh: మానవత్వానికి మరో పేరు అంటే నర్సు. ఎందుకంటే ఓ రోగి పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్న నర్సులు చీదరించుకోరు. దగ్గరనుండి ఆ రోగికి కావలసిన అన్ని సపర్యలు దగ్గరుండి చూసుకుంటారు. అయితె విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు పైన అఘాయిత్యానికి యత్నించాడు ఓ యువకుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ నర్సు పైన ఓ యువకుడు అఘాయిత్యానికి యత్నించాడు. ఆమెను వేధింపులకు గురిచేసి బలాత్కారం చేయడానికి ప్రయత్నించాడు.
Read also:MLC Kavitha: మంథనిలో కవిత పర్యటన.. పెద్దపల్లిలో రోడ్‌షో
ఈ నేపథ్యంలో ఆమె సహకరించక పోవడం తో కత్తితో బెదిరించి దాడి చేసాడు. ఈ క్రమంలో భయాందోళనకు గురైన నర్సు పెద్దగా అరవడం తో ఇతర ఆసుపత్రి సిబ్బంది గది వైపు పరుగున రావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం ఆ నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా అత్యాచార ఘటన ఆ గదిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ నేపథ్యంలో నర్సు మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి రాత్రి 3 గంటల ప్రాంతంలో తన డ్యూటీ రూమ్‌లో పడుకుని ఉన్నానని..ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి గదిలో కి వచ్చి గొళ్ళెం పెట్డాడని..అనంతరం ఆమె పైన బలాత్కరం చేయబోయాడని.. తాను పెద్దగా అరవడం తో నిశబ్ధంగా ఉండమని కత్తితో బెదిరించాడని.. ఆ సమయంలో ఆసుపత్రి సిబ్బంది తన కేకేలు విని గది దగ్గరకి రావడంతో నిందితుడు పరారైయ్యాడని తెలిపింది.