MLC Kavitha: మంథనిలో కవిత పర్యటన.. పెద్దపల్లిలో రోడ్‌షో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు పెద్దపల్లి, మంథనిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు మంథని నియోజకవర్గంలోని కాటారంలోని గారేపల్లిలోని ప్రతిపాదిత మినీ స్టేడియంలో, సాయంత్రం 4 గంటలకు రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని వాణి సూల్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలకు కవిత పాల్గొని ప్రసంగిస్తారు. మంథని బీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్టా మధుకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు జక్కు శ్రీహర్షిణి, మంథని బాలదియ అధ్యక్షురాలు పుట్టా శైలజ నేతృత్వంలో పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Read also: Minister KTR: నేడు భద్రాద్రిలో కేటీఆర్ పర్యటన.. రామాలయ దర్శనం, రోడ్ షో
Also Read
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం పలకడంతో పాటు బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, మహాముత్తారం, మహదేవ్‌పూర్, పమెల, మల్హర్, కాటారం మండలాల్లో ప్రజలు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కోరుతున్నారు. మంథనిలో సందర్శనానంతరం సాయంత్రం 5:30 గంటలకు పెద్దపల్లికి చేరుకుంటారు. పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి ఇక్కడ రోడ్ షో నిర్వహించి జెండా కూడలిలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు. నగరంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. మండలంలోని సెంటినరీ కాలనీ వాణి సెకండరీ పాఠశాల మైదానాన్ని గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్‌రావు పరిశీలించారు.
Minister KTR: నేడు భద్రాద్రిలో కేటీఆర్ పర్యటన.. రామాలయ దర్శనం, రోడ్ షో
తాజావార్తలు
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్‌లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్‌ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!