Karnataka Crime: దృశ్యం-2 రిపీట్.. ప్రియుడితో కలిసి భర్తను గొంతుకోసి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Crime: వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు ప్రియుడితో కలిసి భార్య.. తన భర్తను హత్య చేసింది. సినిమా స్టైల్లో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించింది కానీ పోలీసులకు దొరికి పోయింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేసి మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అసలు విషయం తెలిసి షాకయ్యారు. దృశ్యం-2 సినిమాను ఈ హత్య తలపిస్తోంది. ఈ ఘటన ఘటన బెంగళూరులోని సోలదేవనహళ్లిలో చోటుచేసుకుంది.
అసలు ఏం జరిగింది?
బెంగళూరులోని సోలదేవనహళ్లిలో దేశేగౌడ, జయలక్ష్మిభార్య భర్తలు నివాసం ఉంటున్నారు. 35 ఏళ్ల జయకు 16 ఏళ్ల క్రితం దేశేగౌడతో వివాహమైంది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దంపతులిద్దరూ ఓ వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తున్నారు. అయితే భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలోనే జయకు రాజేష్ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. ఆ తర్వాత అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడు ఎవరూ లేని సమయంలో దేశేగౌడ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. కొన్ని రోజులకు భార్య వివాహేతర సంబంధంపై భర్త దేశేగౌడకు అనుమానం వచ్చింది. ఇదే విషయమై దేశేగౌడ ఆదివారం రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. అదే సమయంలో తన భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం.. ప్రియుడు ఇంటి వెనుక ద్వారం నుంచి లోనికి ప్రవేశించి భర్తను గొంతు కోసి చంపేసింది. ఆవుల కొట్టంలో నుంచి తాడు తెచ్చి కాళ్లు, చేతులను దగ్గరికి లాగి తాళ్లతో కట్టేసి సంచిలో వేశారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
Read also: Paritala Sriram: పవన్ కళ్యాణ్‌కు గుండు కొట్టిన పరిటాల రవి.. పరిటాల శ్రీరామ్ ఏం చెప్పారంటే..?
కారులో మృతదేహాన్ని రామనగర వద్దకు తీసుకెళ్లారు. మృతుడి ఫోన్‌ను నిర్జన ప్రదేశంలో పడేశారు. తర్వాత సాక్షులు దొరక్కుండా హత్యకు ఉపయోగించిన వస్తువులను ఒక్కొక్కటిగా నిర్జన ప్రదేశంలో విసిరేసింది. దేశేగౌడ మృతదేహాన్ని సోలదేవనహళ్లి ఫాంహౌస్ నుంచి కారులో తీసుకెళ్లారు. మైసూరు-బెంగళూరు హైవే పక్కన ఉన్న ఓ కాలువలో 50 మీటర్ల లోతులో మృతదేహాన్ని పాతి పెట్టారు. ఆ తర్వాత రోజు మహిళ తనకు ఏమీ తెలియనట్లుగా నటించింది. పోలీసులకు తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది.ఈకేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు విషాలు తెలిసి షాక్ కు గురయ్యారు. భర్యే ప్రియుడితో కలిసి భర్తను చంపేసిందని దర్యాప్తులో నిజం తెలిసింది. రాంనగర్ జిల్లా కెంపేగౌడ దొడ్డి సమీపంలో దేశేగౌడ మృతదేహం లభ్యమైంది. ఆమెను, తన ప్రియుడిని అదుపులో తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు.
Himanta Biswa Sarma: “లవ్ జీహాద్” వాస్తవం.. దీనికి శ్రద్ధావాకర్ కేసు ఓ ఉదాహరణ..
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!