Dowry Harassment: కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలోని కమల్దిన్ని గ్రామంలో దారుణం జరిగింది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ వివాహితను కిరాతకంగా హత్యకు గురైంది. మృతురాలిని సాక్షిగా గుర్తించిన పోలీసులు.. ఆమె భర్త ఆకాశ్ కాంబర్ హత్య చేసి పరారై ఉంటాడని అనుమానిస్తున్నారు.
కర్ణాటకలోని మైసూరు జిల్లా హునసూరు తాలూకాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. గెరసనహళ్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి రక్షితను ఆమె ప్రియుడు అమానుషంగా హతమార్చాడు. పోలీసుల సమాచారం ప్రకారం, రక్షితకు కేరళకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది.
Red Sandalwood smuggling: ఎర్ర చందనం స్మగ్లింగ్ దందా ఆగడం లేదు. శేషాచలం అడవుల నుంచి చెన్నై- బెంగళూరు జాతీయ రహదారి ద్వారా తరలిపోతోంది. కర్ణాటకకు కూతవేటు దూరంలో ఉన్న గ్రామాలను స్మగ్లర్లు స్టాక్ పాయింట్లుగా పెట్టుకుంటున్నారు. అక్కడి నుంచి యథేచ్ఛగా విదేశాలకు తరలిస్తున్నారు. భాస్కర్ రెడ్డి అనే ఇంటర్నేషనల్ స్మగ్లర్ కనుసన్నల్లో దందా నడుస్తోందంటున్నారు పోలీసులు. ఇన్నాళ్లూ కాస్త స్తబ్దుగా ఉన్న ఎర్ర చందనం దందా.. మళ్లీ చిగురు తొడిగింది. ఇటీవల బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి…
Murder: బెలగావి జిల్లా రామదుర్గ తాలూకాలోని ఖాన్‌పేట్ సమీపంలో జూలై 7న ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడిన స్థితిలో మృతదేహం గుర్తించబడింది. మెడకు టవల్‌తో బిగించి, మర్మాంగంపై దాడి చేసి, తలపై కండరంతో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యపై కేసు నమోదు చేసిన రామదుర్గ పోలీసులు, మృతుడిని ధారవాడ అమ్మినబావి గ్రామానికి చెందిన ఈరప్ప ఆడిన్‌గా గుర్తించారు. కేసును లోతుగా విచారించగా, హత్య వెనుక హృదయాన్ని కలచివేసే కుటుంబ రహస్యాలు వెలుగులోకి…
బెంగళూరు హనుమంత నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునేశ్వర లేఅవుట్‌లో జరిగిన ఒక దారుణ సంఘటన కన్నడ టెలివిజన్ పరిశ్రమను కలవరపెట్టింది. ప్రముఖ టీవీ నటి, యాంకర్ అయిన మంజుల, (స్క్రీన్ నేమ్ శ్రుతి) భర్త అంబరీష్ చేతిలో కత్తిపోట్లకు గురైంది. జూలై 4న జరిగిన ఈ దాడి ఆలస్యంగా వెలుగులోకి రాగా, నిందితుడైన అంబరీష్‌ను పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. తలను గోడకు కొట్టి జూలై 4న, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం…
ఎక్ట్రా కాఫీ కప్పు ఇవ్వనందుకు కస్టమర్లు ఉద్యోగిని చితకబాదిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. బెంగళూరులోని శేషాద్రిపురంలో నమ్మ ఫిల్టర్ కాఫీ షాప్ సిబ్బంది అదనపు కప్పు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన నలుగురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రం కలబురగి నగర శివారు పట్టన్ గ్రామం సమీపంలోని ఓ ధాబా వద్ద దుండగుల బృందం ముగ్గురిని హత్య చేసింది. ఈ ఘనట బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతులు ధాబాలో పని చేసేవాళ్లు. మృతులను సిద్ధారుధ (35), జగదీష్ (25), రామచంద్ర (32)గా పోలీసులు గుర్తించారు. దుండగులు వారిపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ సంఘటన వెనుక పాత శత్రుత్వం ఉందని పోలీసులు తొలుత అనుమానించారు. తాజాగా అదే అనుమానం నిజమని తేలింది.
Mangaluru Murder: కర్ణాటక కోస్తా ప్రాంతంలో జరుగుతున్న హత్యలు ఆ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బజరంగ్ దళ్ మాజీ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య జరిగింది. దీని తర్వాత, తాజాగా సోమవారం, బంట్వాల్ తాలూకాలోని ఇరా కోడి సమీపంలో పికప్ డ్రైవర్, కోల్తమజలు జుమ్మా మసీదు కార్యదర్శి 32 ఏళ్ల అబ్దుల్ రెహమాన్ పట్టపగలు నరికి చంపబడ్డాడు. ఈ దాడిలో అతడి సహచరుడు కలందర్ షఫీ (29) తీవ్ర గాయాలపాలయ్యారు.
Mangaluru: కర్ణాటక కోస్తా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తతెల్తాయి. బజరంగ్ దళ్ మాజీ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య తర్వాత మరో హత్య చోటు చేసుకుంది. వారాల వ్యవధిలోనే ఈ రెండు హత్యలు జరగడం స్థానికంగా ఉద్రిక్తతల్ని పెంచాయి. సోమవారం, బంట్వాల్ తాలూకాలోని ఇరా కోడి సమీపంలో పికప్ డ్రైవర్, స్థానిక మసీదు కార్యదర్శి అయిన 42 ఏళ్ల ఇంతియాజ్ పట్టపగలు నరికి చంపబడ్డాడు.
4 members of a family were stabbed to death in Udupi: కర్ణాటకలోని ఉడుపిలో దారుణం చోటుచేసుకుంది. నేజారు సమీపంలోని తృప్తినగరలో ఓ కుటుంబానికి చెందిన నలుగురిని గుర్తుతెలియని దుండగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. ముసుగు ధరించిన వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి.. పావుగంటలోనే అందరిని హతమార్చి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తృప్తినగరలో హసీనా (46) తన ముగ్గురు పిల్లలతో…