Pune: మహారాష్ట్ర పూణేని గుల్లెయిన్-బారే సిండ్రోమ్(GBS) వ్యాధి కలవరపెడుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 54 కేసులు నమోదైనట్లు పూణే డివిజనల్ కమిషనర్ డాక్టర్ చంద్రకాంత్ పుల్కండ్వర్ తెలిపారు. మరో నలుగురికి ఈ అరుదైన నాడీ రుగ్మత ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పూణే మున్సిపల్ కార్పొరేషన్‌లో 24 మందికి జీబీఎస్‌తో బాధపడుతున్నట్లు పలు ఆస్పత్రులు నివేదించిర తర్వాత, డాక్టర్ పుల్కండ్వర్ రాష్ట్ర, జిల్లా ఆరోగ్య అధికారులతో సమావేశం నిర్వహించారు.
గుల్లెయిన్ బారే సిండ్రోమ్ అనేది నరాలకు సంబంధించిన ఒక వ్యాధి. ఇది ఒక ‘‘ఆటోఇమ్యూన్ డిసీజ్’’. మనల్ని వైరస్, బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవుల నుంచి రక్షించే ఆంటీబాడీలు మన సొంత శరీర కణాలపైనే దాడి చేస్తాయి. ఈ సిండ్రోమ్‌లో నరాలపై మన ప్రతిరక్షక కణాలు దాడి చేస్తాయి. ఈ వ్యాధి రావడానికి పలు వ్యాధులు కారణమవుతాయి. క్యాంపిలోబాక్టర్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతీ 1000 మందిలో ఒకరికి ఈ జీబీఎస్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. సపోర్టివ్ వెంటిలేషన్, ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ (IVIG) వంటి మందులతో కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.
ఈ వ్యాధి వచ్చిన రోగుల సంఖ్య పెరుగుతుండటంతో పుణేలో విలీనమైన ప్రాంతాల్లో అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేంద్ర డూడి తెలిపారు. ప్రధానంగా నాందేడ్, కిర్కత్వాడి, ఇతర ప్రాంతాలతో సహా సింహగఢ్ రోడ్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. సీబీఎస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌తో ముడిపడి ఉన్నట్లు, కలుషిత నీటితో వ్యాప్తికి దారి తీస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నట్లు కొంతమంది వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం పలు ప్రాంతాల నుంచి నీటి శాంపిళ్లను సేకరించారు. “ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) బృందం కూడా రోగుల నుండి నమూనాలను సేకరించింది. త్వరలో వీరి నివేదిక వస్తుంది.
గుల్లెయిన్ బారే సిండ్రోమ్ యొక్క లక్షణాలు
* వేళ్లు, కాలి, చీలమండలు, మణికట్టులో సూదులతో గుచ్చిన అనుభూతి చెందుతాయి
* కాళ్ళలో బలహీనత
* అస్థిరమైన నడక, మెట్లు ఎక్కలేకపోవడం
* మాట్లాడటం, నమలడం, మింగడం వంటి ముఖ కదలికలతో ఇబ్బంది.
* డబుల్ విజన్ లేదా కళ్ళు కదలడానికి ఇబ్బంది పడటం
* తీవ్రమైన నొప్పి , తిమ్మిరి లాగా అనిపించవచ్చు , రాత్రి వేళల్లో అధ్వాన్నంగా ఉండవచ్చు
* మూత్రాశయం నియంత్రణ లేదా ప్రేగు పనితీరుతో సమస్య
* వేగవంతమైన హృదయ స్పందన రేటు
* తక్కువ లేదా అధిక రక్తపోటు
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
గిలియన్ బారే సిండ్రోమ్ యొక్క కారణాలు
GBS వచ్చిన చాలా మంది వ్యక్తులు సాధారణంగా కొన్ని రోజులు లేదా వారాల ముందు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. అయితే,ఈ సిండ్రోమ్ యొక్క ఖచ్చితమైన లేదా ప్రేరేపించగల కొన్ని పరిస్థితులు
* క్యాంపిలోబాక్టర్‌తో సంక్రమణం
* ఇన్ఫ్లుఎంజా వైరస్
* సైటోమెగలోవైరస్
* ఎప్స్టీన్-బార్ వైరస్
* జికా వైరస్
* హెపటైటిస్ A, B, C మరియు E
* హెచ్‌ఐవి, ఎయిడ్స్‌కు కారణమయ్యే వైరస్
* మైకోప్లాస్మా న్యుమోనియా
* సర్జరీ
* గాయం
* హాడ్కిన్ లింఫోమా
* అరుదుగా, ఇన్ఫ్లుఎంజా టీకాలు లేదా చిన్ననాటి టీకాలు
* కోవిడ్-19 వైరస్.
గులియన్ బారే సిండ్రోమ్ యొక్క సమస్యలు
పరిస్థితి మీ నరాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి, నరాలచే నియంత్రించబడే విధులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
* తిమ్మిరి
* గుండె మరియు రక్తపోటు సమస్యలు
* నొప్పి
* ప్రేగు మరియు మూత్రాశయం పనితీరులో ఇబ్బంది
* రక్తం గడ్డకట్టడం