గులియన్ బారే సిండ్రోమ్.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జీబీఎస్ వ్యాధితో మహిళ మృతి చెందింది. ప్రకాశం జిల్లాలోని అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళ గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. జీబీఎస్ వ్యాధితో ప్రకాశం జిల్లా మహిళ మృతి చెందిన ఘటనపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పందించారు. జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. Also…
First GBS Death In AP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి జీబీఎస్ మరణం సంభవించింది. ప్రకాశం జిల్లాలోని కొమరఓలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళ గులియన్ బారే సిండ్రోమ్ వ్యాదితో చికిత్స సోకడంతో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. కొద్దిసేపటి క్రితం మృతి చెందింది.
GBS Virus : మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ (GBS) విజృంభణ నిరంతరం పెరుగుతోంది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207 కు పెరిగింది. ఫిబ్రవరి 14న మరో ఇద్దరు అనుమానిత రోగులు కనుగొనబడ్డారు.
GBS Virus In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 17 గులియన్ బర్రె సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆరు జిల్లాల్లో ఈ జీబీఎస్ కేసులు నమోదు అయినట్టు గుర్తించారు.
Pune : మహారాష్ట్ర పశ్చిమ ప్రాంతమైన పూణేలో ఒక వింత వ్యాధి అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. ఈ వ్యాధి గత వారం నుండి పూణేలో వ్యాపిస్తోంది. ఈ మర్మమైన వ్యాధి పేరు గిలియన్-బార్ సిండ్రోమ్(GBS)..
Guillain-Barre Syndrome: పూణేతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలను వణికిస్తున్న గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (GBS) కారణంగా ఒక యువకుడు మరణించాడు. ధయారి ప్రాంతంలో నివసిస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) శనివారం సాయంత్రం షోలాపూర్‌లో చికిత్స పొందుతూ మరణించారు.
Pune: మహారాష్ట్ర పూణేని గుల్లెయిన్-బారే సిండ్రోమ్(GBS) వ్యాధి కలవరపెడుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 54 కేసులు నమోదైనట్లు పూణే డివిజనల్ కమిషనర్ డాక్టర్ చంద్రకాంత్ పుల్కండ్వర్ తెలిపారు. మరో నలుగురికి ఈ అరుదైన నాడీ రుగ్మత ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పూణే మున్సిపల్ కార్పొరేషన్‌లో 24 మందికి జీబీఎస్‌తో బాధపడుతున్నట్లు పలు ఆస్పత్రులు నివేదించిర తర్వాత, డాక్టర్ పుల్కండ్వర్ రాష్ట్ర, జిల్లా ఆరోగ్య అధికారులతో సమావేశం నిర్వహించారు.