కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కర్ణాటకలో కరోనా మహమ్మారి తగ్గేదేలే అంటోంది. తాజాగా కర్ణాటకలో 40,499 కరోనా కేసులు రాగా, 21 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 23,209 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 2,67,650 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గుజరాత్‌లో 20,966 కొత్త కరోనా కేసులు రాగా, 9,828 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 12 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం గుజరాత్‌లో 90,726 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఢిల్లీలో కొత్తగా 13,785 కరోనా కేసులు రాగా, 35 మంది కరోనాతో మరణించారు. గడచిన 24గంటల్లో ఢిల్లీలో 16,580 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
యాక్టివ్ కేసులు 75,282 ఉన్నాయి. తమిళనాడులో కొత్తగా 26,981 కరోనా కేసులు రాగా, 17,456 మంది కోలుకున్నారు. మరో 35 మంది గడిచిన 24 గంటల్లో మరణించారు. ముంబాయిలో 6,032 కరోనా కేసులు రాగా, 18,241 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 12 మంది గడిచిన 24 గంటల్లో కరోనాతో మరణించారు. పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా 11,447 కరోనా కేసులు రాగా, 15,418 కరోనా నుంచి కోలుకున్నారు. 38 మంది గడిచిన 24గంటల్లో కరోనాతో మృత్యువాత పడ్డారు.