గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి శాంతిస్తోంది. కరోనా కట్టడికి అగ్ర దేశమైన అమెరికా సైతం కోవిడ్ టీకాలపైనే ఆధారపడింది. అయితే ఇప్పటికే కరోనా టీకాలు ఆయా దేశాలు విస్తృతంగా చేపట్టాయి. అయితే ఫ్రాన్స్ వంటి దేశాల్లో 75శాతం కరోనా టీకాలు పంపిణీ జరిగినా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ప్రస్తుతం భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. భారతదేశంలో గత 24 గంటల్లో 19,968 కొత్త…
కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కర్ణాటకలో కరోనా మహమ్మారి తగ్గేదేలే అంటోంది. తాజాగా కర్ణాటకలో 40,499 కరోనా కేసులు రాగా, 21 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 23,209 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 2,67,650 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గుజరాత్‌లో 20,966 కొత్త కరోనా కేసులు రాగా, 9,828 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 12 మంది…
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా, ఒమిక్రాన్ పిల్లలపై పెను ప్రభావమే చూపిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తుండడంతో.. అమెరికా, యూరప్‌ల్లో అధికశాతం చిన్నారులు.. ఆస్పత్రుల్లో చేరుతున్నారు.అయితే కరోనా నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ ద్వారా వీటికి కళ్లెం వేయవచ్చంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. అనేక దేశాల్లో కొవిడ్ మూడో దశ మొదలైనట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఈ వేరియంట్ పిల్లలపైనా అధికంగానే ప్రభావం చూపుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మొదటి రెండు దశల సమయంలో పిల్లలపై అంతగా ప్రభావం చూపని…
థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు ఆంక్షలు విధింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం సూచించారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలని, మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలన్నారు. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలని జగన్ అన్నారు. బస్సు ప్రయాణికులు కూడా మాస్క్ ధరించేలా చూడాలని, బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో…
కరోనా మహమ్మారి యావత్తు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత మరోసారి విజృంభిస్తోంది. అయితే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించి పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతోంది. తెలంగాణలో సైతం ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా, ఒమిక్రాన్ కట్టడికి బూస్టర్ డోస్‌ను వేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించడంతో దేశంలోని పలు రాష్ట్రాలో బూస్టర్ డోస్‌లు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో…
ఉరుకుల పరుగుల జీవితాలు.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు.. నిద్రలోనూ.. భవిష్యత్ కార్యచరణపై ఆలోచనలతో సాగిపోతున్న వేళ.. కనివిని ఎరుగని రీతిలో కరోనా మహమ్మారి దెబ్బకొట్టింది. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా ధాటికి ఎన్నో కుటుంబాలు కకావికలమయ్యాయి. కరోనా దెబ్బకు అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనా ముందు మోకరిళ్లింది అనడంలో అతిశయోక్తి లేదు. కరోనా కట్టడికి కోవిడ్ నిబంధనలు పెట్టి, ఆఖరికి ప్రజలందరి కాళ్లకు లాక్‌డౌన్‌తో బంధం వేసినా కరోనా అదుపులోకి రాలేదు.…
యావత్తు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మరోసారి ప్రపంప దేశాలపై విరుచుకుపడుతోంది. అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు అత్యాధునిక టెక్నాలజీ ఉన్న దేశాలు సైతం కరోనా దెబ్బకు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్ ప్రభావంతో కరోనా కేసులు కూడా భారీ పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 16.39 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా తాజాగా…
ఊహించినట్టే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దాంతో ప్రపంచ దేశాలు మారోసారి ప్రమాదంలో పడ్డాయి. దీని మూలంగా భారత్‌లో కారోనా థర్డ్‌వేవ్ మొదలైంది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో అధిక సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. రానున్న రోజుల్లో తీవ్ర రూపం దాలుస్తుందనటానికి ఇది సంకేతం. ఐతే, థర్డ్ వేవ్‌ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే సెకండ్ వేవ్ నిర్వహణలో ఘోర వైఫల్యం వల్ల ఈ ప్రశ్న తలెత్తుతోంది. ఒమిక్రాన్…
ఇటీవల వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో విజృంభిస్తోంది. రోజురోజుకు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా యూకే, యూఎస్ దేశాలలో ఇప్పటికే ఒమిక్రాన్ బారినపడిన కొందరు మృత్యువాత పడుతున్నారు. అయితే ప్రతి సంవత్సరం న్యూఇయర్ వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా యువతి న్యూఇయర్ వేడుకల్లో చేసి సంబరాలు అంతా ఇంతా కాదు. కొందరు ఉన్న ఊర్లోనే సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే, మరి కొందరు పబ్‌లు, రిసార్ట్‌ల్లో జరుపుకుంటున్నారు.…