Upasana-Ram Charan: పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన..మెగా ఇంట సంబరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ఫ్యామిలిలోకి మరో చిన్నారి వచ్చేసింది.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల జంట తల్లి దండ్రులు అయ్యారు.. సోమవారం ఆసుపత్రిలో చేరిన ఉపాసన ఈ రోజు ఉదయం ఆడబడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ జోడీకి మంగళవారం తెల్లవారు జామున అంటే జూన్ 20న ఆడబిడ్డ పుట్టినట్లు జూబ్లీహిల్స్‌లో ని అపోలో హాస్పిటల్ మెడికల్ బులెటిన్ ద్వారా ధృవీకరించింది. ఈ వార్తతో కొణిదెల, కామినేని కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. మెగా ప్రిన్సెస్ రాకతో చిరంజీవి, సురేఖ, అనిల్ కామినేని, శోభనా కామినేని గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్‌లు అయ్యారు.. మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవద్దుల్లేవని చెప్పాలి..
మెగా హీరో రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఒక్కో సినిమాతో ఎదుగుతూ గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకుని తండ్రి పేరు నిలబెట్టిన రామ్ చరణ్ తండ్రి కాబోతున్న ఆనందక్షణాలు. వీటికోసమే మెగాభిమానుల ఎదురుచూపులు ఇప్పటివి కావు. అందరి ఆశలు నిజం చేస్తూ రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఈరోజు తల్లిదండ్రులు అయ్యారు. జూన్ 20 వేకువఝామున 4గంటలకు కొణిదెల ఇంట మెగా వారసురాలు జన్మించింది.. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఈరోజు ఉపాసన పండంటి పాపాయికి జన్మనిచ్చారు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
ఈ వార్తతో మెగా కుటుంబం లో సంతోషం నెలకొంది. ఆసుపత్రిలో రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, శ్రీమతి సురేఖ దంపతులు ఈ ఉద్విగ్న క్షణాలను ఎంతో ఆనందంతో అనుభవించారు. ఇంతటి అద్భుత క్షణాలు మెగా ఇంట మెరవడంతో కొణిదెల కుటుంబమే కాదు.. ఫ్యాన్స్ కూడా ఆనందంలో మునిగిపోయారు.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాభిమానులు మెగా వారసురాలి పేరు మీద అనేక దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయించేందుకు సిద్ధమయ్యారు.. ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్ వరుస సినిమాల తో బిజీగా ఉన్నారు.. శంకర్ దర్శకత్వం లో గేమ్ చేంజర్ సినిమా లో నటిస్తున్నారు.. అలాగే మరో రెండు ప్రాజెక్టు లలో నటిస్తున్నారు..
The mega power couple @AlwaysRamCharan & @upasanakonidela welcomed their first born, the #MegaPrincess, in the early hours of Tuesday ❤️#RamCharan #Upasana #GlobalStarRamCharan #GameChanger pic.twitter.com/c66kQMtEUW
— Suresh Kondeti (@santoshamsuresh) June 19, 2023
తాజావార్తలు
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!