ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్దది. 2030 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్థూల దేశీయోత్పత్తి ( GDP) రేటు ఏడాదికేడాది పెరుగుతోంది. వీటన్నిటి మధ్య, తలసరి ప్రాతిపదికన ఆదాయాన్ని కొలిచినప్పుడు, భారతదేశం చాలా వెనుకబడి ఉంది. తలసరి ఆదాయం పరంగా, భారతదేశం పరిస్థితి పేదరికం, అసమానత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న దేశమైన నమీబియా కంటే దారుణంగా ఉంది. ప్రపంచ అసమానత నివేదికలో వెల్లడైనట్లుగా,…
Rs.2000 Note Withdrawal: రూ.2000 నోటు ఉపసంహరణ నిర్ణయం, దానికి వస్తున్న ఇప్పటి వరకు వచ్చిన ప్రతిస్పందన చూస్తే 2024 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిని మరింతగా పెంచే అవకాశం ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఆర్బీఐ అంచనా వేసిన 6.5 శాతం వృద్ధిని మించి పెరిగేందుకు సహాయపడుతుందని ఒక నివేదిక తెలిపింది.
India's GDP grows at 6.3% in Jul-Sept quarter of FY23: భారతదేశ జీడీపీ వృద్ధిరేటు 2023 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతంగా నమోదు అయింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం వృద్ధి చెందిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది. బుధవారం అధికారిక డేటాను విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఇది గతేడాదితో పోలిస్తే తక్కువే. 2021-22 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో…