Yawar took 15 Lakhs and exited from Bigg Boss Telugu 7 Finale: ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో మిగిలిపోయిన టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ఒక్కక్కరిని ఎలిమినేట్ చేస్త్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంటెస్టెంట్స్‌కు బ్యాక్ టు బ్యాక్ ఫన్నీ టాస్కులు ఇస్తూ.. ఆడియన్స్‌ను అలరిస్తున్న బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే అర్జున్ అంబటి, ప్రియాంక జైన్ లు ఎలిమినేట్ అయినట్లు లీక్స్ వచ్చాయి. ఇక వీటితో పాటు కంటెస్టెంట్స్‌కు మరో ఫన్ టాస్క్ కూడా బిగ్ బాస్ ఇచ్చాడు. దాని ప్రకారం హెల్మెట్, బ్లైండ్ ఫోల్డ్ ధరించి కంటెస్టెంట్స్ అందరూ గార్డెన్ ఏరియాలో ఏర్పరిచిన కుర్చీలో కూర్చోవాల్సి ఉంటుంది. అలా ఒకరు తర్వాత ఒకరు కుర్చీలో కూర్చున్నవారి హెల్మెట్‌పై సాఫ్ట్ స్టిక్‌తో కొట్టాల్సి ఉంటుంది. కుర్చీలో కూర్చున్నవారు, వారిని కొట్టిందెవరో గెస్ చేయాల్సి ఉంటుంది’’ అని టాస్క్ ఇవ్వగా ఆ ఫస్ట్ టాస్క్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్లాడు బిగ్ బాస్.
Hyderabad: రవీంద్ర భారతిలో గిరిజన ఎమ్మెల్యేలకు ఆత్మీయ సత్కారం.. పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి
హౌజ్‌లోకి ఒక సూట్‌కేస్ పంపించి ‘‘మీ ముందు ఉన్న సూట్‌కేస్‌లో రూ.15 లక్షలు ఉన్నాయని. దానిని మీరు తీసుకోవాలి అనుకుంటున్నారా?’’ అని అడగగా ముందు కంటెస్టెంట్స్ అంతా ఆలోచనలో పడ్డారు. ప్రతీ సీజన్‌లో కంటెస్టెంట్స్‌కు సూట్‌కేస్ ఆఫర్ ఇస్తాడు బిగ్ బాస్, అయితే మరీ ఇంత ముందుగా ఎప్పుడూ ఇవ్వ లేదు. ఇక దాన్ని బట్టి చూస్తే ఆ సూట్ కేస్ తీసుకొని ఎవ్వరైనా ఇప్పుడే హౌజ్ నుండి వెళ్లిపోవచ్చని క్లారిటీ ఇవ్వడంతో యావర్ తెలివిగా ఆలోచించాడు. నిజానికి యావర్ ఆ 15 లక్షలు తీసుకుని బయటకు వెళ్ళిపోతాను అని ప్రకటించి షాక్ ఇచ్చాడు. నిజానికి యావర్ మంచి పనే చేశాడు. ఎందుకంటే ఆయన తీసుకోకపోతే నాలుగో కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయి కాళీ చేతులతో వచ్చేవాడు, కానీ సూట్ కేస్ తీసుకోవడంతో ఆ 15 లక్షలు కూడా దక్కాయి.