Yarlagadda Supriya: యార్లగడ్డ సుప్రియ గురించి అందరికి తెల్సిందే. అక్కినేని నాగార్జున మేనకోడలిగా .. అన్నపూర్ణ స్టూడియోస్ ను ఒంటిచేత్తో నడిపిస్తుంది. అంతకుముందులా అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పుడు వరుస సినిమాలు తీయడం లేదు. దీంతో మళ్లీ దానికి పూర్వవైభవం తీసుకురావాలని ట్రై చేస్తుంది. అందులో భాగంగానే కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమాను తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో రిలీజ్ చేసింది సుప్రియ. చాయ్ బిస్కెట్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బాయ్స్ హాస్టల్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే చాయ్ బిస్కెట్ నిర్మాత శరత్ చంద్ర .. ఈ మధ్యనే ఒక యూట్యూబర్ తో వివాదానికి దిగినట్లు వార్తలు వచ్చాయి. సదురు యూట్యూబర్ ను శరత్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని, తొక్కేస్తా.. సైబర్ క్రైమ్ లో కేసు వేస్తా .. నీ ఛానెల్ లేపేస్తా అంటూ బెదిరించాడని చెప్పుకొచ్చారు. ఇక ఈ వివాదం సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా ఈ వివాదాన్ని సద్దుమణిగించే బాధ్యతను సుప్రియ తీసుకుంది.
Siva Nirvana: ‘ఖుషి’లో వింటేజ్ సమంత.. వెరీ సెన్సిటివ్ ఇష్యూను చూపిస్తాం!
నేడు బాయ్స్ హాస్టల్ సక్సెస్ మీట్ లో ఒక రిపోర్టర్ ఇదే విషయాన్ని శరత్ చంద్రను అడుగగా.. ఆయన ప్లేస్ లో సుప్రియ సమాధానం చెప్తూ.. “శరత్ చంద్ర వాళ్లకి గీర ఎక్కువ అండీ.. ఏదైనా అంటే.. ఫస్ట్ లాజిక్ ఒకటి ఎవరైనా అంటే .. వీళ్లు రెండు లాజిక్ లు ఎదురుచెప్పాలి. అది చెప్పేవరకు శరత్ కు నిద్రపట్టదు.. అది చెప్పాలి.. ప్రూవ్ అవ్వాలి” అని చెప్పింది. ఇక పాజిటివ్ రివ్యూ తీసుకున్నప్పుడు.. నెగెటివ్ రివ్యూస్ ఎందుకు తీసుకోరు అన్న ప్రశ్నకు సుప్రియ మాట్లాడుతూ.. ” తీసుకోలేక పోయే పరిస్థితి మీరు అస్సలు కల్పించరు. తీసుకోవాల్సిందే. సినిమా మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు.. మీరే దానికి అంబాసిడర్లు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.