Vijay – Rashmika : రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస డిజాస్టర్లతో నలిగిపోతున్నాడు. భారీ అంచనాలతో వచ్చిన కింగ్డమ్ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. లాంగ్ రన్ లో చేతులెత్తేసింది. దీంతో ఇప్పుడు విజయ్ ఆశలు మొత్తం రాహుల్ సాంకృత్యన్ మీదనే పెట్టుకున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన ట్యాక్సీవాలా మంచి హిట్ అయింది. అందుకే ఈ మూవీతో కచ్చితంగా హిట్ కొడుతామనే నమ్మకంతో ఉన్నారు. ఇందులో రష్మిక నటిస్తుండటం మరో అంశం. రష్మిక విజయ్ కు ఓ సెంటిమెంట్. గతంలో వీరిద్దరు నటించిన గీతాగోవిందం బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది ఆ మూవీ.
Read Also : Jeevitha-Rajashekar : కావాలనే జీవిత, రాజశేఖర్ గొడవపడ్డారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
ఆ తర్వాత వచ్చిన కామ్రేడ్ మూవీ కూడా యావరేజ్ గా ఆడింది. అందుకే ఇప్పుడు రష్మిక సెంటిమెంట్ తనను హిట్ ట్రాక్ ఎక్కిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు విజయ్ దేవరకొండ. పైగా రాహుల మీద నమ్మకంతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం కలిసొచ్చే అంశం. ఇలా అన్ని విధాలుగా ఈ సారి పర్ ఫెక్ట్ చేసుకుని రంగంలోకి దిగుతున్నాడు విజయ్. అన్ని ఆయుధాలకు తోడు రష్మిక సెంటిమెంట్ తన వెనకుంది కాబట్టి ఈ సారి గట్టిగానే కొట్టాలని ఫిక్స్ అవుతున్నాడు విజయ్. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. 2026లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Read Also : Actors Re-Union : శ్రీకాంత్, అలీ బ్యాచ్ రీ యూనియన్.. ఫొటోలు వైరల్