కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య ఆయన తమ్ముడు కార్తీ సినిమాలు రిలీజ్ కావడంలో తర్జన భర్జన పడుతున్నాయి. ముందుగా తమ్ముడు కార్తీ డిసెంబర్ నెలలో వా వాతియార్ తో బాక్సాఫీస్ ఆక్యుపై చేద్దామనుకుంటే స్టూడియో గ్రీన్ కు ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడింది. అసలు ఈ సినిమా ఎప్పుడు బయటకు వస్తుందో క్లారిటీ లేదు. ఇప్పటికే మూడేళ్ల నుండి షూట్ చేసుకున్న ఈ సినిమా అనేక సార్లు రిలీజ్డేట్ అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ అవుతునే ఉంది. ఎట్టకేలకు రిలీజౌతుందనుకున్న టైంలో లాస్ట్ మినిట్ లో ఆర్థిక కష్టాలు అడ్డుగా మారాయి. దాంతో రిలీజ్ వాయిదా వేస్తూ వస్తున్నారు మేకర్స్.
Also Read : ThalapathyVijay : జననాయగన్ సెన్సార్ సర్టిఫికెట్ పిటిషన్ పై నేడు మద్రాసు హైకోర్టులో విచారణ…
ఇక సూర్య కరుప్పు షూట్ కంప్లీటైనా ఇప్పటి వరకు కొత్త అప్డేట్ ఇవ్వలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో డేట్ ఎనౌన్స్ చేయలేదు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న కరుప్పును గత ఏడాది దీపావళికే తీసుకురావాలనుకున్నారు. కానీ షూట్ పెండింగ్ ఉండటంతో సంక్రాంతికి తీసుకురావాలనుకున్నారు. దళపతి విజయ్, శివకార్తీకేయన్ కర్చీఫ్ వేయడంతో అప్పుడు కూడా ఎందుకులే అంటూ టైమ్ పాస్ చేశారు. కానీ తాజాగా కోలీవుడ్‌లో అందుతున్న సమాచారం ప్రకారం జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో సినిమా రిలీజ్ చేయబోతున్నారట. అయితే ఇప్పటి వరకు చడీ చప్పుడు లేకుండా ఉన్న కరుప్పు ప్రమోషన్స్.. సంక్రాంతికి రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ నుండి షురూ చేస్తారన్నది లెటేస్ట్ టాక్.