Rahul Gandhi: ప్రభుత్వం మారితే వారిపై చర్యలు, ఇదే నా హామీ.. రాహుల్ గాంధీ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: బీజేపీ నేతలకు పరోక్షంగా హెచ్చరించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ రూ. 1800 కోట్లు ఫైన్ కట్టాలని ఇన్కమ్ టాక్స్ నోటీసులు అందుకున్న తర్వాత దీనిని ‘‘టాక్స్ టెర్రరిజం’’గా ఆరోపించింది. ‘‘ ప్రభుత్వం మారినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇలాంటివి మళ్లీ చేసే ధైర్యం ఎవరూ చేయని విధంగా చర్యలు తీసుకుంటాము. ఇది నా హామీ’’ అని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ హెచ్చరించారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఐటీ శాఖ రూ. 200 కోట్ల జరిమానా విధించడంతో ఇప్పటికే నిధుల కొరతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి తాజా నోటీసులు మరింత ఇబ్బందికి గురిచేశాయి. హైకోర్టు ఈ కేసులో ఎలాంటి ఉపశమనం ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది.
ఐటీ శాఖ బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. బీజేపీ గత కొన్నేళ్లుగా వేలాది మంది నుంచి విరాళాలు పొందిందని, వారి ఆదాయపు పన్ను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. బీజేపీ ఆదాయ పన్ను చట్టాలను ఉల్లంఘిస్తోందని, ఆ పార్టీ నుంచి రూ. 4617.58 కోట్ల డిమాండ్‌ని సేకరించాలని ఐటీని కోరారు. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, పోస్ట్ రైడ్ లంచాలు, షెల్ కంపెనీలను ఉపయోగించి ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ ద్వారా బీజేపీ రూ. 8200 కోట్లు వసూలు చేసిందని జైరాం రమేష్ ఆరోపించారు. కాంగ్రెస్‌ని ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తుందని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.
जब सरकार बदलेगी तो ‘लोकतंत्र का चीरहरण’ करने वालों पर कार्रवाई ज़रूर होगी!
और ऐसी कार्रवाई होगी कि दोबारा फिर किसी की हिम्मत नहीं होगी, ये सब करने की।
ये मेरी गारंटी है।#BJPTaxTerrorism pic.twitter.com/SSkiolorvH
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2024
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..