Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalyani Priyadarshan: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సంచలన విజయం సినీ పరిశ్రమలో ఒక నటి భవితవ్యాన్ని, స్టార్‌డమ్‌ను ఏ స్థాయికి తీసుకెళ్లగలదో చెప్పడానికి కల్యాణి ప్రియదర్శన్ తాజా ప్రయాణమే నిదర్శనం. స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చి, తనకంటూ స్వంత గుర్తింపు కోసం కష్టపడ్డ ఈ మలయాళ ముద్దుగుమ్మ కెరీర్‌ను ‘లోకా’ చిత్రం అనూహ్య మలుపు తిప్పింది. స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, సౌత్ ఇండియాలోనే ఆల్-టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రంగా ‘లోకా’ రికార్డు సృష్టించింది. అయితే ఈ భారీ హిట్ తర్వాత కల్యాణి ఇకపై తెలుగు, దక్షిణాది సినిమాలకు శాశ్వతంగా దూరమవుతోందా? పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితం కానుందా? అన్న అంశం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
‘లోకా’ తెచ్చిన అసాధారణ క్రేజ్ కల్యాణికి ఏకంగా బాలీవుడ్ బడా ప్రాజెక్ట్‌లో గోల్డెన్ ఛాన్స్ దక్కేలా చేసింది. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ సరసన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ప్రళయ్’ సినిమాలో ఆమె ప్రధాన పాత్రకు ఎంపికైంది. అయితే కేవలం షూటింగ్ సమయాల్లో వచ్చి వెళ్లడం కాకుండా, ఈ ప్రాజెక్ట్‌ను సీరియస్‌గా తీసుకున్న కల్యాణి ఏకంగా తన నివాసాన్ని ముంబైకి మార్చేయడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జుహులోని అత్యంత విలాసవంతమైన అపార్ట్మెంట్లో ఆమె కోసం నిర్మాతలు ప్రత్యేక వసతి ఏర్పాటు చేశారని, షూటింగ్ పూర్తయ్యే దాకా ఆమె అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం కల్యాణి గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రమిస్తోందని తెలుస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్న నేపథ్యం కావడంతో, ప్రత్యేక యాక్షన్ ట్రైనింగ్ తీసుకోవడంతో పాటు రణ్వీర్ సింగ్‌తో కలిసి వర్క్‌షాప్‌లలో పాల్గొంటోంది. అంతేకాకుండా, స్క్రీన్‌పై అత్యంత నాజూగ్గా, పవర్ఫుల్ లుక్‌లో కనిపించేందుకు కఠినమైన డైట్ నియమాలను పాటిస్తూ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంటోంది. జూలైలో మొదలైన ఫస్ట్ షెడ్యూల్ తర్వాత, అక్టోబర్ నుంచి తదుపరి భారీ షెడ్యూల్ ప్రారంభం కానుండటంతో ఆమె ఈ విరామంలోనూ నిరంతర సాధనలోనే నిమగ్నమైంది.
Also Read
- The Traitors Telugu :'చీప్.. మిడిల్ క్లాస్'.. వర్ష'పై శ్రీదేవి చౌదరి సంచలన వ్యాఖ్యలు.. ‘ట్రెయిటర్స్’లో ముదురుతున్న వివాదం!
- Killer Movie: ఇంటర్వెల్ ట్విస్ట్ చెబితే ఏకంగా కోటి రూపాయలు: డైరెక్టర్ సంచలన ఛాలెంజ్
- Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
- Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: 'రుద్రవనం'లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
కల్యాణి ముంబైకి మకాం మార్చడం చూసి, ఇకపై ఆమె తెలుగు లేదా ఇతర దక్షిణాది సినిమాల వైపు చూడదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఖాతాలో తమిళంలో ‘మార్షల్’ షూటింగ్ పూర్తి కాగా, ‘జీని’ చిత్రంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అయితే తెలుగు సినిమాల ఊసే పెద్దగా వినిపించకపోవడం, ఎక్కువ సమయం ముంబైలోనే గడుపుతుండటంతో ఆమె బాలీవుడ్లోనే సెటిల్ అయ్యే యోచనలో ఉందా అనే గుసగుసలు మొదలయ్యాయి. అయితే సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ‘ప్రళయ్’ లాంటి భారీ ప్యాన్-ఇండియా యాక్షన్ మూవీ డిమాండ్ మేరకే ఆమె ముంబైలో ఉంటూ వర్క్‌షాప్‌లు చేస్తోందని, ఇది కేవలం సినిమా ప్రొఫెషనల్ అవసరం మాత్రమేనని సమాచారం. తనను ఆదరించిన దక్షిణాదిని ఆమె ఎప్పటికీ వదులుకోదని సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నప్పటికీ, ‘ప్రళయ్’ రిలీజ్ తర్వాత వచ్చే రిజల్ట్‌ను బట్టి ఆమె బాలీవుడ్ పర్మనెంట్ స్టార్‌గా ఎదుగుతుందా లేక ఇరు పరిశ్రమలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తుందా అన్నది కాలమే నిర్ణయించాలని అంటున్నారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!