ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆర్ఆర్ఆర్ మ్యానియా నడుస్తోంది. నాలుగేళ్ల ఎదురుచూపులకు ఇంకొక్క రోజులో తెరపడనుంది. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడనున్నారు అభిమానులు. ఈ విజువల్ వండర్ కి సూత్రధారి దర్శకధీరుడు రాజమౌళి. అస్సలు ఇండస్ట్రీలో జరగదు అనుకున్న కాంబోని జరిపి చూపించాడు. చిత్ర పరిశ్రమలోనే అపజయాన్ని ఎరుగని ఈ దర్శకదీరుడు ఈ సినిమాకు భారీ పారితోషికమే తీసుకున్నాడని టాక్ నడుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ కోసం డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ దాదాపు రూ. 80 కోట్లకు పైగానే రాజమౌళికి ముట్టజెప్పారని టాక్ వినిపిస్తోంది.
నిర్మాత డీవీవీ దానయ్య మాత్రం ఎక్కడ తగ్గకూడదని, పూర్తి నమ్మకం జక్కన్న పై పెట్టి ఆయన పారితోషికం కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ స్టార్ హీరోలు సైతం ఈ సినిమా కోసం దాదాపు రూ. 50 కోట్లు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక మరోపక్క ఈ సినిమా లాభాల్లో రాజమౌళికి 30 శాతం దానయ్య ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ లెక్కన రాజమౌళికి దాదాపు 300 కోట్లు అందే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఈ వార్త అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.