War 2 Vs Coolie : ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో భారీ క్లాస్ తప్పేలా లేదు. అవి రెండూ పాన్ ఇండియా సినిమాలే. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కూలీ. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది పాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. ఈ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇదే రోజున జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్-2 కూడా రాబోతోంది. ఇప్పటికే రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించేశారు. ఇవి రెండూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే పెద్ద వారే జరుగుతుంది. ఎందుకంటే రెండూ భారీ సినిమాలే. పైగా కూలీలో కూడా నాగార్జున, ఉపేంద్ర నటిస్తున్నారు. కాబట్టి కూలీ మూవీకి మూడు భాషల్లో భారీ డిమాండ్ ఉంటుంది.
Read Also : Vikram Misri: పాకిస్థాన్ చీకటి రహస్యాలను ప్రపంచానికి వెల్లడించిన విక్రమ్ మిస్రీ ఎవరు?
కూలీలో నటిస్తున్న ముగ్గురూ మూడు ఇండస్ట్రీలలో అగ్ర హీరోలే. కాబట్టి దీనికి తెలుగు, తమిళం, కన్నడలో భారీ క్రేజ్ ఏర్పడింది. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా కలెక్షన్ల ఊచకోత జరుగుతుంది. అసలే లోకేష్ డైరెక్షన్ మీద అన్ని భాషల్లో మంచి క్రేజ్ ఉంది. కాబట్టి సౌత్ లో ఈ మూవీకి తిరుగులేదు. అటు వార్-2 విషయానికి వస్తే.. బాలీవుడ్ తో పాటు తెలుగులో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ హిట్ అయిన వార్ మూవీకి సీక్వెల్ కాబట్టి.. సౌత్ లో కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ కూలీ మూవీకి ఉన్నట్టు తమిళం, కన్నడ, మలయాళంలో దీనికి అంత క్రేజ్ లేదు. ఎందుకంటే సౌత్ నుంచి ఎన్టీఆర్ ఒక్కడే ఇందులో ఉన్నాడు. కానీ హిట్ టాక్ వస్తే కలెక్షన్లకు ఢోకా ఉండదు. కానీ కూలీ సినిమాతో పోలిస్తే తమిళం, కన్నడలో కలెక్షన్లు తక్కువగానే వచ్చే ఛాన్స్ ఉంది. అటు బాలీవుడ్ లో కూలీ కంటే వార్-2కే ఎక్కువ క్రేజ్ ఉంది. సౌత్ లో కలెక్షన్లు తగ్గినా బాలీవుడ్ లో వార్-2 కవర్ చేసేస్తుంది. మరి ఏ మూవీ ఏ స్థాయి హిట్ కొడుతుందో చూడాలి.
Read Also : Eesha Rebba : ఈషారెబ్బా సొగసుల గాలం..