Vyjayanthi Movies: టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లో వైజయంతీ మూవీస్ ఒకటి. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రొడక్షన్ హౌస్ టాలీవుడ్ కు మంచి మంచి హిట్లు ఇస్తూ వస్తుంది. మధ్యలో కొంత వెనుకపడినా .. యంగ్ జనరేషన్ ఆ సంస్థను చేతుల్లోకి తీసుకొని.. ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇక ప్రస్తుతం వైజయంతీ మూవీస్ లో తెరకెక్కుతున్న చిత్రాల్లో అందరి కళ్ళు ఉన్నది మాత్రం కల్కి మీదనే. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అన్ని ఇండస్ట్రీలు ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుగుపుకుంటుంది. ఇకపోతే.. ఈ మధ్యనే కల్కి నుంచి ఒక పోస్టర్ లీక్ అయితే .. వారు ఎంత సీరియస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా యూనిట్ లో మనిషే ఆ పోస్టర్ ను లీక్ చేసాడని తెలియడంతో అతనిపై లీగల్ యాక్షన్ కూడా తీసుకున్నారు. రెండేళ్లు ఎంతో కష్టపడి .. ఒక్క లీక్ కూడా రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇలా లీక్ అవ్వడం పై అశ్వినీదత్ సీరియస్ అయ్యి లీగల్ గా చర్యలు తీసుకున్నాడు.
ఇక తాజాగా మరోసారి వైజయంతీ మూవీస్ మరో లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్లు తెలిపింది. అయితే ఈసారి కల్కి గురించి కాదు.. 1990 లో రిలీజ్ అయ్యి, భారీ విజయాన్ని అందుకున్న జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా గురించి. ప్రస్తుతం ఏదైనా సినిమా.. పాత సినిమాకు పోలిక ఉంటే .. ఆ సినిమాను చూసి ఇన్స్పైర్ అయ్యాం.. ఆ సినిమా నుంచి కొంత రాసుకున్నాం అనే డైలాగ్స్ వింటూనే ఉంటాం. ఇక ఇప్పుడు జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి సినిమా కథనే ఒకటి తెరమీదకు వస్తుందని తెలిసి.. ముందుగానే వైజయంతీ మూవీస్ హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఒక ప్రకటన అధికారికంగా షేర్ చేశారు. అందులో ఏముందంటే.. చిరంజీవి, శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 1990 లో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రానికి వైజయంతీ మూవీస్ ఒరిజినల్ ఎకుూజివ్ కాపీరైట్ ఓనర్లు మరియు నిర్మాతలు అని సాధారణంగా ప్రజలకు మరియు ముఖ్యంగా సినిమా ట్రేడ్కు ఈ నోటీసు ఇవ్వబడింది.
మేము అన్ని అనుబంధ మేధో సంపత్తి హక్కులు, నైతిక హక్కులు, పాత్ర హక్కులు, కథ, సంగీతం, స్క్రిప్ట్, ఆర్క్లు, పూర్తి కాలానికి చలనచిత్ర పాత్రలతో సహా చలనచిత్రంలో అన్ని కథా హక్కులు కలిగి ఉన్న కాపీరైట్ యజమానులం. ప్రపంచవ్యాప్తంగా ఏ భాషలోనైనా ఈ సినిమా ఆధారంగా రీమేక్లు, సీక్వెల్లు, ప్రీక్వెల్లు, వెబ్ సిరీస్లు ఏదైనా చేయడానికి కేవలం మాకు మాత్రమే హక్కు ఉంది. మేము, ఏ మూడవ పక్షానికి ఏదైనా డెరివేటివ్ వర్క్లను సృష్టించే హక్కులతో సహా ఎలాంటి హక్కులను మంజూరు చేయలేదని మేము దీని ద్వారా ధృవీకరిస్తున్నాము మరియు ప్రకటిస్తున్నాము. ఈ పబ్లిక్ నోటీసు ద్వారా, ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏదైనా డెరివేటివ్ వర్క్స్ సహా ఫిల్మ్ మరియు/లేదా దాని అంతర్లీన వర్క్ నుండి ఏదైనా మెటీరియల్ని ఉపయోగించి ఏదైనా ఉల్లంఘించే కంటెంట్ను రూపొందించడానికి ప్రయత్నించే ఎవరైనా కాపీరైట్
ఉల్లంఘనకు బాధ్యత వహిస్తారని మేము అందరికీ తెలియజేస్తున్నాము. అలా చేసిన యెడల వారు చట్టరీత్యా కాపీ రైట్ చేసినందుకు తగిన చర్యలు తీసుకొనే బాధ్యత మాకు ఉందని తెలియజేస్తున్నాము” అని తెలిపారు. అయితే ఇలాంటి ఒక సినిమాను దృష్టిలో పెట్టుకొని కథ రాసింది ఎవరు అనేది మాత్రం మిస్టరీగా మారింది.
Unauthorized use of our film #JagadekaVeeruduAthilokaSundari and its content will result in legal action. pic.twitter.com/0Kv19RpoBJ
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 10, 2023