యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒక సెన్సేషన్. సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ, హిట్స్ కొడుతున్న విశ్వక్ సేన్ డైరెక్టర్ గా మారి చేస్తున్న రెండో సినిమా ‘దాస్ కా ధమ్కీ’. నైజాంలో మంచి గ్రిప్ మైంటైన్ చేస్తున్న విశ్వక్ సేన్, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘దాస్ కా ధమ్కీ’ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న రిలీజ్ అవ్వాల్సి ఉంది. ట్రైలర్ 1తో పాటు ఒక సాంగ్ ని కూడా విశ్వక్ సేన్ రిలీజ్ చేసి మంచి బజ్ జనరేట్ చేశాడు. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకి మంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసింది. ఇక ప్రమోషన్స్ ని స్పీడ్ పెంచడమే లేట్ అనుకుంటున్న టైంలో CG వర్క్ పెండింగ్ ఉంది, అందుకే విడుదలని వాయిదా వేస్తున్నాం అంటూ విశ్వక్ సేన్ అన్నౌన్సుమేట్ ఇచ్చేశాడు. కొత్త రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేస్తాను అంటూ విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ సినిమాని వాయిదా వెయ్యడం అతని అభిమానులకి షాక్ ఇచ్చింది.
Read Also: Raviteja: మాస్ మహారాజ పాన్ ఇండియా సినిమా షూటింగ్… నైట్ ఎఫెక్ట్ లో
కొంతమంది మాత్రం విశ్వక్ సేన్ తన సినిమాని వాయిదా వెయ్యడానికి థియేటర్స్ కారణం అని మాట్లాడుతున్నారు. ఫిబ్రవరి 17న సమంతా నటిస్తున్న శాకుంతలం, కిరణ్ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ, ధనుష్ నటిస్తున్న సార్, సంతోష్ శోభన్ నటిస్తున్న శ్రీదేవి శోభన్ బాబు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల్లో ఎవరు నటిస్తున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే దిల్ రాజు, అల్లు అరవింద్, సీతారా ఎంటర్తైన్మెంట్స్, యువీ క్రియేషన్స్ లాంటి బ్యానర్ ఈ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఈ ప్రొడ్యూసర్స్ ని దాటి ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకి రావడం అనేది కాస్త కష్టమైన పనే. ఈ విషయం క్లియర్ కట్ గా తెలుసు కాబట్టే విశ్వక్ సేన్ తన సినిమాని వాయిదా వేసినట్లు ఉన్నాడు అని సినీ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. నిజానికి ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన సమయంలోనే పెద్ద బ్యానర్ల నుంచి సినిమాలు వస్తున్నాయి కాబట్టి ‘దాస్ కా ధమ్కీ’ మూవీ ఆ టైంలో రిలీజ్ కాదు అని గెస్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు.
#DasKaDhamki stands postponed due to pending CG work.
The New Release Date will be announced soon 🔜
Eesari Theatres lo ichipadedham 🤙
@VishwakSenActor @Nivetha_Tweets @KumarBezwada @leon_james @VanmayeCreation @VScinemas_ @saregamasouth pic.twitter.com/zoGAS9k0yN— VishwakSen (@VishwakSenActor) February 7, 2023