Nani: విజయ్- రష్మిక ప్రైవేట్ ఫొటోస్.. అందరి ముందు లీక్ చేసిన నాని.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ఈ ఏడాది దసరా భారీ హిట్ అందుకున్న నాని.. ఇప్పుడు హాయ్ నాన్న తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన నాని.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ ను పెంచుతున్నాడు. ఇక గతరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో ఒక పొరపాటు జరిగింది. అది పొరపాటా.. ? లేక కావాలని హైప్ కోసం తీసుకొచ్చిందా.. ? అనేది తెలియదు కానీ, ప్రస్తుతం ఆ నింద మాత్రం నాని మీదకే వెళ్ళింది.
NTR: మీరు ఓట్లు వేయరా.. రిపోర్టర్స్ కు సెటైర్ వేసిన ఎన్టీఆర్
Also Read
అసలు ఏం జరిగింది అంటే. . ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ప్రేక్షకులను నవ్వించడానికి, సెలబ్రిటీస్ కు బోర్ కొట్టించకుండా ఉండడానికి యాంకర్ సుమ.. ప్రయత్నిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఫన్నీ ప్రశ్నలు అడగడం, ఫన్నీ ఫోటోలు చూపించి క్యాప్షన్స్ చెప్పమని చెప్పడం చేస్తూ ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని, మృణాల్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను చూపించి వారిద్దరిని క్యాప్షన్స్ చెప్పమని చెప్పింది. అన్ని బాగానే ఉన్నాయి కానీ.. ఆ ఫొటోల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మాల్దీవ్స్ ఫొటోను ఎడిట్ చేసి చూపించారు. దానికి సుమ.. మృణాల్ ను క్యాప్షన్ అడిగింది. మృణాల్.. వెకేషన్ మోడ్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక మృణాల్ తో పాటు వెనుక ఉన్న ఫ్యాన్స్ అడగగా.. లవ్ బర్డ్స్ అని చెప్పడంతో సుమ సైతం ఓకే .. అదే.. మీరు అనుకున్నదే అని చెప్పి నవ్వేసింది. ఇక ఈ ఫోటోపై విజయ్- రష్మిక అభిమానులు మండిపడుతున్నారు. ప్రమోషన్స్ హైప్ కోసం ఇంతలా దిగజారాలా.. ? వారి పర్సనల్ ఫొటోస్ అందరిముందు చూపించడం ఏంటి.. ? అది పొరపాటు అయితే నాని వెంటనే అడ్డుకొని ఆపేయాల్సింది పోయి.. సైలెంట్ గా ఎందుకు కూర్చున్నాడు.. ? అంటూ నానిపై నిందలు వేస్తున్నారు. మృణాల్.. ప్రస్తుతం విజయ్ తో ఫ్యామిలీ స్టార్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. అలా ఫోటోలను తీసుకుంటే .. విజయ్ ఒక్కడే ఉన్న ఫోటోలను వదిలేసి.. రష్మికను కూడా యాడ్ చేసి ఎందుకు చూపించినట్లు అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ పొరపాటుపై నాని ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!