NTR: మీరు ఓట్లు వేయరా.. రిపోర్టర్స్ కు సెటైర్ వేసిన ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: నేడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే. మరో ఐదేళ్లు తెలంగాణను ఎవరు పరిపాలించాలి అనేదాన్ని ఆలోచించి ప్రజలు తమకు నచ్చిన పార్టీకి ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లకు వెళ్తున్నారు. ఇక తాము కూడా దేశ పౌరులుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి షూటింగ్స్ ను పక్కన పెట్టి మరీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఉదయం నుంచి జూబ్లీహిల్స్ లో తరాల సందడి ఎక్కువ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్ తమ కుటుంబాలతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్.. రిపోర్టర్లతో సరదాగా ముచ్చటించాడు. మొదటి నుంచి కూడా తారక్ బయట ఎంత ఫన్నీగా ఉంటాడో అందరికీ తెల్సిందే. ఎయిర్ పోర్ట్ లో కూడా ఫొటోగ్రాఫర్లు కనిపిస్తే.. మీకు ఇల్లు లేదా.. ? కుటుంబం లేదా.. ? ఎప్పుడు ఇక్కడే ఉంటారు అంటూ సెటైర్లు వేస్తూ ఉంటాడు.
Chiranjeevi: చిరుపై మరోసారి ట్రోలింగ్.. మీమ్స్ తో పిచ్చెక్కిస్తున్నారుగా
Also Read
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
తాజాగా పోలింగ్ బూత్ లో కూడా ఎన్టీఆర్.. రిపోర్టర్లకు అలాగే సెటైర్ వేశాడు. లైన్లో నిలబడిన తారక్ ను వరుసగా ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపిస్తుంటే.. వెంటనే తారక్.. “మీరందరూ ఇక్కడే ఉంటారా? ఓట్లు వేయరా?” అని అడిగాడు. అందుకు వారు.. మీరు వెళ్ళాక వేస్తామని కొందరు, సగం మంది వేయరు అని ఇంకొందరు చెప్పుకొచ్చారు. అందుకు తారక్ సగం మంది వేయరా.. ? అని అడగ్గా.. నో సర్ అని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం తారక్.. దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!