Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- సుప్రీంకోర్టును పదేపదే ఆశ్రయించి విసిగిపోయానన్న కపిల్ సిబల్
- న్యాయవ్యవస్థపై సిబల్ నమ్మకాన్ని తిరిగి తెస్తామని సుప్రీంకోర్టు వ్యాఖ్య
- ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఆశించిన ఉపశమనం లభించడం లేదన్న సిబల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kapil Sibal: ఎన్నికల ఓటర్ల జాబితాలో అక్రమాలపై పదే పదే సుప్రీంకోర్టును ఆశ్రయించి విసిగిపోయానని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. సిబల్ వ్యాఖ్యలపై స్పందించిన సుప్రీంకోర్టు.. న్యాయవ్యవస్థపై ఆయనకు ఉన్న నమ్మకాన్ని తిరిగి తీసుకువస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శనివారం నిర్వహించిన నిరసనలపై సుప్రీంకోర్టు ఆదివారం ప్రత్యేక విచారణ చేపట్టింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనల్లో పలువురు నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలపై సిబల్ అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భంలో, సుప్రీంకోర్టు సిబల్ నమ్మకాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు మేము ఇక్కడే ఉన్నాం, ఆయన విశ్వాసం మా ఆయుధాగారంలోని అత్యంత బలమైన ఆయుధాల్లో ఒకటి అని వ్యాఖ్యానించింది.
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
దీనికి ముందు సిబల్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాలో అక్రమాలపై పదేపదే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నా ఆశించిన ఉపశమనం లభించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ‘‘సుప్రీంకోర్టుకు వెళ్లి మేము విసిగిపోయాం. అక్కడికి వెళ్లడం వల్ల ప్రయోజనం లేదనే భావన నాలో కలుగుతోంది’’ అని అన్నారు. ప్రధాన న్యాయమూర్తిపై అసంతృప్తిగా ఉన్నారా? అని ప్రశ్నించగా.. ఇది వ్యక్తిగత సంతృప్తి లేదా అసంతృప్తికి సంబంధించిన విషయం కాదని, ప్రజల హక్కుల కోసం పోరాడటం న్యాయవాదుల బాధ్యత అని చెప్పారు.
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించి నిరసనలను అడ్డుకోవడాన్ని సిబల్ ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపే వ్యక్తుల వల్ల సమాజానికి ఏం ముప్పని ప్రశ్నించారు. సమాజానికి ప్రమాదం లేదని, ప్రభుత్వానికి ప్రమాదం ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. నిరసనకారులపై ఢిల్లీ పోలీసుల నిర్బంధంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్‌తో పాటు న్యాయవాదులు తారా నరులా, శుభాంగిని శర్మలను అడ్డుకోవడాన్ని కపిల్ సిబల్ ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!