Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamitha Baiju: ‘హను-మాన్’ సృష్టించిన ప్రభంజనం తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ పాన్-ఇండియా విజువల్ వండర్‌లో కనిపించబోయే హీరోయిన్ ఎవరనే అంశంపై గత కొద్దిరోజులుగా రకరకాల పేర్లు వినిపించాయి. తాజాగా ఈ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ పడినట్లు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. యూత్ ఆడియన్స్‌లో సెన్సేషనల్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళ క్రష్ మమితా బైజు ‘జై హనుమాన్’లో ఫిమేల్ లీడ్‌గా ఎంపికైనట్లు తెలుస్తుంది.
‘ప్రేమలు’ చిత్రంతో కుర్రకారు కలల రాణిగా మారిన ఈ బ్యూటీని, ఒక మైథలాజికల్ యాక్షన్ డ్రామాలో రిషబ్ శెట్టి లాంటి స్టార్ పక్కన రంగంలోకి దించడం ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డివైన్ అండ్ పవర్ఫుల్ సబ్జెక్ట్‌లో మమితా పాత్ర ఎంతటి ప్రత్యేకతను సంతరించుకోనుందో అన్నది ఆసక్తి రేపుతోంది. సాధారణంగా ఇలాంటి పాన్-ఇండియా సినిమాల్లో నటీనటులను భారీ పోస్టర్లు, అనౌన్స్మెంట్లతో అధికారికంగా పరిచయం చేస్తుంటారు. కానీ ప్రశాంత్ వర్మ మార్క్ సర్ప్రైజ్ ఇక్కడే కనిపించింది. ఎలాంటి అధికారిక హడావుడి లేకుండానే మమితా బైజు కొద్ది రోజుల క్రితమే గుట్టుచప్పుడు కాకుండా చిత్ర షూటింగ్లో అడుగుపెట్టేసినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న కీలక షెడ్యూల్లో ఆమె రిషబ్ శెట్టితో కలిసి పాల్గొంటున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
Also Read
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!