VijayDevarakonda : విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్నాడు. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. చాలా కాలం తర్వాత ఇందులో ఆయన డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో సూర్య, హిందీలో రణ్ బీర్ కపూర్ లు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో అన్ని భాషల్లో మూవీపై భారీ హైప్ పెరిగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. టీజర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
Read Also : Peddi : పెద్ది నుంచి 20 సెకన్ల గ్లింప్స్.. బుచ్చిబాబు ప్లాన్
‘సినిమా టీజర్ బాగా వచ్చింది. కానీ దానికి మంచి వాయిస్ ఓవర్ కావాలని అనుకున్నాం. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్న వాయిస్ అయితే దూసుకెళ్తుందని డిసైడ్ అయ్యాం. నేను వెళ్లి అన్నను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగా. వెంటనే ఓకే అన్నాడు. ఈ రోజు సాయంత్రమే చేసేద్దాం అన్నాడు. డైరెక్టర్ లేడు.. చెన్నైలో ఉన్నాడని చెప్పాం. కానీ ఎన్టీఆర్ అన్న పర్లేదన్నాడు. నువ్వు ఉన్నావ్ కదా పదా వెళ్లి చేద్దాం అన్నాడు. అన్నను ఏది అడిగినా అస్సలు కాదనడు. ఎవరైనా అన్న సపోర్టు కోసం వెళ్లినా కాదనకుండా చేస్తాడు’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. తెలుగు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంపై భారీ పాజిటివ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ గతంలో కూడా చాలా సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే.