Peddi : రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమా నుంచి నిన్న ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ శిష్యుడు కావడంతో పాటు.. సినిమా టేకింగ్ మీద బుచ్చిబాబుకు మంచి పట్టు ఉంది. అందుకే సినిమా మీద అంచనాలు విపరీతంగా ఉండేవి. నిన్న రామ్ చరణ్ బర్త్ డే రోజు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడింది. కానీ నిన్న నోట్లో చుట్టు పెట్టుకుని రామ్ చరణ్ ఉన్న లుక్ మీద కొన్ని నెగెటివ్ ట్రోల్స్ వచ్చాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లాగా ఉందంటూ టాక్ వచ్చింది.
Read Also : MS Dhoni: ఏంటీ స్టంపింగ్ భయ్యా.. చిరుత వేగం
దీంతో బుచ్చిబాబు మరో ప్లాన్ వేస్తున్నాడు. ఉగాది రోజున లేదా శ్రీరామ నవమి ఎట్టి పరిస్థితుల్లో గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన 20 సెకన్ల గ్లింప్స్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. ఆ గ్లింప్స్ లో రామ్ చరణ్ విధ్వంసంను అలా టచ్ చేసి చూపిస్తారంట. ఆ దెబ్బతో నెగెటివిటీ మొత్తం కొట్టుకుపోయి మూవీపై పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుందని ప్లాన్ చేస్తున్నారంట. గతంలో చాలా పెద్ద సినిమాలు ఫస్ట్ లుక్ విషయంలో కొంత నెగెటివిటీ వస్తే.. గ్లింప్స్ రిలీజ్ చేసి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేవాళ్లు. ఇప్పుడు బుచ్చిబాబు కూడా అదే దారిలో వెళ్లాలని చూస్తున్నారంట. ప్రేక్షకుల మదిలో మూవీపై ఓ హైప్ ను పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన టీమ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.