Vijay-Rashmika : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మళ్లీ దొరికేశారు. కావాలని దొరుకుతున్నారా లేదంటే అనుకోకుండా జరుగుతోందా అర్థం కావట్లేదు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. వారు మాత్రం దానిపై క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ వీరిద్దరు ఎక్కడకు వెళ్లినా సరే ఇట్టే దొరికేస్తుంటారు. ఆ నడుమ వేర్వేరు ఎయిర్ పోర్టుల నుంచి మాల్దీవ్స్ కు వెళ్లి దొరికిపోయారు. మొన్నటికి మొన్న ఓ రెస్టారెంట్ కు ఒకరి తర్వాత ఒకరు వెళ్లి దొరికేశారు. ఇప్పుడు మరోసారి ఒకే బీచ్ కు వెళ్లి వేర్వేరుగా ఫొటోలు దిగి పోస్టు చేశారు. కానీ నెటిజన్లకు దొరికిపోయారు. ఏప్రిల్ 5న రష్మిక తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఒమన్ కు వెళ్లింది.
Read Also : Meerut Murder: మీరట్ మర్డర్ కేసులో ట్విస్ట్.. జైలులో ముస్కాన్ ప్రెగ్నెన్సీ నిర్ధారణ..
అక్కడే తన బర్త్ డే జరుపుకుంది. ఆ తర్వాత ఒమన్ బీచ్ కు వెళ్లింది. అక్కడ సింగిల్ గా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. సరిగ్గా ఒక రోజు తర్వాత విజయ్ దేవరకొండ కూడా సేమ్ అదే బీచ్ లో గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోలను, అక్కడ నడుచుకుంటూ వస్తున్న ఫొటోలను పోస్టు చేశారు. కానీ ఇద్దరి ఫొటోల్లో బ్యాక్ గ్రౌండ్ సేమ్. అవే చెట్లు, అవే బిల్డింగ్ లు కనిపిస్తున్నాయి. అంటే రష్మిక బర్త్ డే కోసం విజయ్ అక్కడకు వెళ్లాడు. ఇద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకుని ఇలా సింగిల్ ఫొటోలను షేర్ చేశారు. ఇవి చూసిన నెటిజన్లు ఇంకెన్ని రోజులు ఇలా దాస్తారు.. పెళ్లి చేసుకుంటారా ఇలాగే ప్రతిసారి దొరికిపోతారా అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.