Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ రిలీజ్ కు సిద్దమవుతున్న వేళ ప్రమోషన్స్ జోరును పెంచేశారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల విజయ్, అనన్య పాండే.. బాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీ షో కాఫీ విత్ కరణ్ షోకు వెళ్లిన విషయం విదితమే.. ఈ ఫుల్ ఎపిసోడ్ నేటి నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ టాక్ షో లో విజయ్ ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయాన్నీ ఎట్టకేలకు రాబట్టాడు కరణ్. ఎన్నో రోజుల నుంచి హీరోయిన్ రష్మికకు, విజయ్ కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు గుప్పుమంటున్న విషయం విదితమే. ఈ విషయమై రష్మిక, విజయ్ ఇప్పటివరకు నోరుమెదిపింది లేదు.. తామిద్దరం స్నేహితులమే అని చెప్పుకొంటూ వస్తున్నారు.
ఇక తాజాగా ఈ షో లో విజయ్ తమ బంధం గురించి బయటపడ్డాడు. “నేను, రష్మిక ఒకేసారి కెరీర్ ను ప్రారంభించాం.. నా కెరీర్ ప్రారంభంలోనే ఆమెతో రెండు సినిమాలు చేశాను. అప్పటినుంచి మంచి స్నేహితులమయ్యాం. రష్మిక ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. ఇద్దరం కష్టసుఖాలను పంచుకుంటాం. కెరీర్ గురించే ఎక్కువ ఆలోచిస్తాం. దాని వలన మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఉంటుంది. నిజంగా తను నా డార్లింగ్.. ఆమె అంటే నాకు చాలా ఇష్టం” అంటూ చెప్పుకొచ్చాడు. అంటారు అనుకున్నట్లు తాము ప్రేమికులం కాదు అని మంచి స్నేహితులమే అని గట్టిగానే చెప్పుకొచ్చాడు. మరి విజయ్ ఇచ్చిన క్లారిటీతో ఈ పుకార్లకు చెక్ పడుతుందో లేదో చూడాలి.