Vijay Antony: సాధారణంగా ఈ లోకంలో డబ్బు ఉంటే అన్ని కాళ్ల దగ్గరకి వస్తాయి అని చెప్తూ ఉంటారు. అది నిజం కూడా .. కానీ, అన్ని సమయాల్లో.. అందరి జీవితాల్లో డబ్బు ఒక్కటే ప్రధానం కాదు అన్నది ఎన్నోసట్లు నిరూపితమైంది. డబ్బు ఉంటే.. బెడ్ ను కొనగలం నిద్రను కొనలేం. ఆహారాన్ని కొనగలం ఆకలిని కొనలేం అని ఎవరో ఒక మహాకవి చెప్పాడు. అలాగే చాలామంది డబ్బు ఉన్నా.. ప్రశాంతతను కొనలేకపోతున్నారు. అందుకే చిన్న వయస్సులోనే స్ట్రెస్, డిప్రెషన్ కు గురవుతున్నారు. దానివలన ఏం చేస్తున్నారో తెలియకుండానే.. బలవంతంగా ప్రాణాలు వదిలేస్తున్నారు. అప్పుడు హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇలాగే డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు హీరో విజయ్ ఆంటోనీ కూతురు 16 ఏళ్ళ వయస్సులో డిప్రెషన్ వలన సూసైడ్ చేసుకొని మృతి చెందడం ఇండస్ట్రీని కుదిపేస్తోంది.
PAPA: తమిళంలో దా…దా.. తెలుగులో పా…పా.. ఫస్ట్ లుక్ చూశారా?
బిచ్చగాడు సినిమాతో తెలుగువారికి సుపరిచితుడుగా మారాడు విజయ్ ఆంటోని. ఇక ఈ ఏడాది బిచ్చగాడు 2 చిత్రంతో ఆ విజయ పరంపరను కొనసాగించాడు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పైకి నవ్వుతూ కనిపిస్తున్న విజయ్ జీవితంలో ఎన్నో విషాదాలు నెలకొన్నాయి. అతని ఏడేళ్ల వయస్సులో అతని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్నీ విజయ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ” నాకు ఏడేళ్లు.. నా చెల్లికి ఐదేళ్లు ఉన్నప్పుడు మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. సమస్యలన్నింటికీ ఆత్మహత్య పరిష్కారం కాదు. ఆయన చనిపోయాక.. మమ్మల్ని పెంచడానికి మా అమ్మ ఎంతో కష్టపడింది. అందుకే ఆత్మహత్య అనే మాట వింటే .. నాకు ఎంతో బాధ అనిపిస్తుంది” అని చెప్పుకొచ్చాడు.
Athidhi Web Series Review : అతిథి వెబ్ సిరీస్ రివ్యూ
ఇక విజయ్ పెద్ద కూతురు మీరా.. ఇప్పుడు తన తాతగారిలానే ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం విజయ్ కు జీవితంలో మర్చిపోలేని విషాదం. తన పిల్లలిద్దరినీ విజయ్ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. చదువు విషయంలో వారిని ఎప్పుడు ఒత్తిడి చేయలేదని, వారికి ఏది నచ్చితే అది అవ్వాలని మాత్రమే కోరుకున్నట్లు ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇక మీరా ఆత్మహత్య వెనుక అంత ఒత్తిడి ఉన్న కారణాలు ఏంటి అనేది ఇప్పటికీ మిస్టరీగా మారింది. అప్పుడు ఏడేళ్ల వయస్సులో కన్నతండ్రిని .. ఇప్పుడు 16 ఏళ్ల వయస్సున్న కన్నకూతురును విజయ్ పోగొట్టుకున్నాడు. విజయ్ జీవితంలోనే ఎందుకిలా జరుగుతుంది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. విజయ్ కుటుంబానికి దేవుడు దైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు.