Vidyut Jammwal: సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్ లు, విడాకులు ఇవన్నీ సర్వ సాధారణంగా మారిపోయాయి. ఒక సినిమాతో పరిచయమైన హీరో హీరోయిన్లు కొన్నేళ్ళకు ప్రేమలో పడినట్లు చెప్పడం.. పెళ్లివరకు వెళ్లడం, ఆ తరువాత విబేధాలు వచ్చాయి అని విడిపోవడం. ఇక ఈ మధ్య అయితే గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాక విడిపోతున్నారు. అఖిల్, విశాల్, త్రిష, మెహ్రీన్, రష్మిక .. వీరందరూ ఎంతో గ్రాండ్ గా నిశితార్థం చేసుకొని ఆ తరువాత పెళ్లి క్యాన్సిల్ అని చెప్పి షాక్ ఇచ్చారు. తాజాగా వీరి లిస్ట్ లో చేరిపోయాడు బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్. ఈ కుర్ర హీరో తెలుగువారికి కూడా సుపరిచితమే ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి, సూర్య నటించిన సికిందర్ సినిమాల్లో మంచి పాత్రలు చేసి మెప్పించాడు. ఇక బాలీవుడ్ లో కమాండో, ఖుదా హఫీజ్, జంగ్లీ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలనే అందుకున్నాడు.
Newsense Teaser: జర్నలిజం చేస్తున్నారా.. వ్యభిచారం చేస్తున్నారా..?
ఇక విద్యుత్ గత కొన్నేళ్లుగా నందితా మహ్తాని అనే ఫ్యాషన్ డిజైనర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని బీచ్ లు, రెస్టారెంట్లు అంటూ తిరిగారు. గతేడాది ఈ జంట ప్రేమకు సింబల్ అయిన తాజ్ మహల్ వద్ద నిలబడి తమ ప్రేమను వ్యక్తపరిచారు. తాము ప్రేమలో ఉన్నట్లు అభిమానులతో పంచుకున్నారు. అనంతరం ఈ జనతా నిశ్చితార్థం కూడా చేసుకొంది. కొద్దిరోజుల్లో పెళ్లి ఉంటుంది అనుకొనేలోపు వీరు బ్రేకప్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కూడా బ్రేకప్ కోట్స్ పెడుతూ ఇన్స్టాగ్రామ్ ను హీట్ ఎక్కిస్తున్నారు. ఇంకోపక్క అనన్య పాండే కజిన్ పెళ్ళిలో కూడా ఎడమొహం, పెడమొహం గా కనిపించడంతో వీరి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ వార్త విన్న నెటిజన్స్ ఈ బ్రేకప్ లు, ప్యాచప్ లు మీకు అలవాటే కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.