Newsense Teaser: యంగ్ హీరో నవదీప్ ఈ మధ్య సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చాడు. ఈ మధ్య ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్న నవదీప్ ఈసారి వెబ్ సిరీస్ మీద దృష్టి సారించాడు. తాజాగా నవదీప్, బిందు మాధవి జంటగా తెరకెక్కిన వెబ్ సిరీస్ న్యూసెన్స్. శ్రీ ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేస్తూ.. తనదైన శైలిలో ఈ సినిమా యొక్క అర్దాన్ని చెప్పుకొచ్చాడు. ” వినోదం కోసం ఒక అమ్మాయి బట్టలు విప్పి తన బాడీ చూపిస్తూ డ్యాన్స్ చేస్తుంది. అలాగే వీక్షకుల రేటింగ్‌ల కోసం ఇతర వ్యక్తులను నగ్నంగా చూపించడానికి ఒక న్యూస్ ఛానెల్ వారి దుస్తులను తీసివేస్తుంది. అలాంటి ఒక సిరీస్ ఆహాలో న్యూసెన్స్ పేరుతో వస్తుంది చూడండి” అంటూ చెప్పుకొచ్చాడు.
Rajendra Prasad: నరేష్ నిత్య పెళ్ళికొడుకు.. వాడి రేంజ్ కత్తి నేను కాదు
ఒఇక టీజర్ విషయానికొస్తే.. మదనపల్లి అనే గ్రామంలో ఉన్న రాజకీయాలు, వాటిని బయటకు తీసుకురావాలనుకొనే జర్నలిస్టుల మధ్య పోరులా కనిపిస్తుంది. నవదీప్, బిందు మాధవి జర్నలిస్టులు. డబ్బు కోసం నవదీప్ నిజాలను బయటపెట్టకుండా ఉంటాడు. ఇంకోపక్క బిందు నిజం కోసం వెతుకుతున్నట్లు చూపించారు. రాజకీయ వేత్తలు, పోలీసులు మధ్యలో ఈ జర్నలిస్టుల మధ్య జరిగిన యుద్ధమే న్యూసెన్స్ సిరీస్ లా కనిపిస్తోంది. టీజర్ లోనే జర్నలిజం పైన, జర్నలిస్టులపైన కొన్ని అనుచిత డైలాగ్స్ ను గుప్పించారు. వాస్తవాలని మీడియా చూపిస్తుందా..? లేక మీడియా చూపించేవన్నీ వాస్తవాలా..?, మనం న్యూస్ రాస్తే రెండు వందలే.. రాయకపోతే రెండు వేలు వస్తాయి. అందుకే మన పెన్నులో ఇంక్ ఎప్పుడు ఉంటుంది.. జర్నలిజం చేస్తున్నారా.. వ్యభిచారం చేస్తున్నారా..? లాంటి డైలాగ్స్ జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసేలానే ఉన్నాయి. మరి ఈ వివాదాస్పదమైన టీజర్ పై జర్నలిస్టులు ఎలా స్పందిస్తారో చూడాలి.
A stripper takes off her clothes to show her NAKED body for entertainment.A News channel takes off clothes of other people to show them NAKED for viewership ratings..Now @ahavideoIN in its series NEWSENSE is making news channels NAKED. Here’s teaser 2.0 https://t.co/TkIB5sGMXF
— Ram Gopal Varma (@RGVzoomin) March 21, 2023