Vicky Kaushal: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టైగర్ 3. యష్ రాజ్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. నిరాశపరిచింది. ఇక ఈ సినిమాలో కత్రీనా లేడీ స్పైగా కనిపించింది. ఇక ముఖ్యంగా టవల్ ఫైట్ లో కత్రీనా యాక్షన్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ సీన్ కోసమే అభిమానులు థియేటర్ కు వెళ్లారు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఇక ఈ సీన్ సినిమాలో అంతగా రక్తి కట్టించలేదు. ఇక ఈ సీన్ కోసం కత్రీనా ఎంత కష్టపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా కత్రీనా టవల్ సీన్ గురించి.. ఆమె భర్త విక్కీ కౌశల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ టవల్ సీన్ చూశాక.. కత్రీనాను చూసి భయపడినట్లు చెప్పుకొచ్చాడు.
Upendra: ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు.. అయినా ఐదు సినిమాలు లైన్లో!
“టైగర్ 3 సినిమాను కత్రీనా తో కలిసి మొదటిరోజే చూశాను. యాక్షన్ సీన్స్ లో కత్రీనా ఎంతో బాగా నటించింది. దానికోసం ఎంతో కష్టపడింది. టవల్ ఫైట్ చూసి నేను షాక్ అయ్యాను. ఆ సీన్ చూసాక.. ఆమె పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది అనుకున్నాను. ఈ సీక్వెన్స్ తరువాత కత్రీనాను చూసి.. ఇక నుంచి నీతో గొడవపడకపోవడమే మంచింది. లేకపోతే నువ్వు టవల్ సాయంతో కొట్టినా కొడతావు అని సరదాగా చెప్పాను. ఆమె ఇంత కష్టపడడం చూసి.. నేను గర్వపడుతున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.