HanuMan: తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. టాలీవుడ్ లో మొట్ట మొదటి సూపర్ హీరో సినిమాగా హనుమాన్ తెరకెక్కింది. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మూడోవ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆవకాయ.. ఆంజనేయ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హనుమంతుని బలం ఏంటి అనేది ఎంతో అద్భుతంగా చూపించారు. తెలుగువారు ఆవకాయ పట్టేటప్పుడు పాడే పాటలా అనిపిస్తుంది.
Mahesh Babu: మహేష్ టీ షర్ట్ .. చూడడానికే సింపుల్.. కొనడం మన వల్ల కాదు మావా
ఇక ఈ వీడియోలో కొంతమంది విలన్స్ అమ్రితా చుట్టూ ఏడిపిస్తుంటే.. తేజ.. హనుమంతుడిలా వచ్చి కాపాడుతుంటే.. పక్కన ఆవకాయ పెడుతున్న ఆడవారు.. హనుమంతుని గొప్పతనం చెప్పారు. ఇక సింహాచలం మన్నెల లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను సాహితి గాలిదేవర అద్భుతంగా ఆలపించింది. ఇక విజువల్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఇక ప్రశాంత్ వర్మ టేకింగ్ చూస్తుంటే.. ఈ సినిమా భారీ విజయం అందుకుంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.