బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘ఛావా’. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ను దినేష్ విజన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు వైభవంగా జరుపుతున్నారు మూవీ టీం. ఇందులో భాగంగా తాజాగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈవెంట్ లో హీరో విక్కీ కౌశల్ తో పాటుగా రష్మిక మందన్న కూడా పాల్గొంది. విక్కీ స్వయంగా రష్మికను వీల్ చైర్ లో కుర్చోబెట్టుకొని చాలా జాగ్రత్తగా స్టేజ్ మీదకు తీసుకొచ్చాడు. ఇక విక్కీ, రష్మిక వారి జర్నీ గురించి మాట్లాడుతూ .. ‘ఛావా’ సినిమాతో అనుభాని పంచుకున్నారు..
Also Read: Chandoo Mondeti : ‘కార్తికేయ-3’ గురించి అప్డేట్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటి
ముందుగా విక్కీ మాట్లాడుతూ.. ‘ నేను ఈ ‘ఛావా’ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రిపేర్ అయ్యాను. యుద్ధాలు, గుర్రపు స్వారీలు శిక్షణ తీసుకున్నాను. వీటన్నింటికంటే ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్ర పోషించడం నా మనసుకి ఛాలెంజింగ్ గా అనిపించింది. ఛత్రపతి శివాజీ శ్రీరాముని వంటి వారు. ఛత్రపతి శంభాజీ సింహం వంటి యోధుడు. ఈ క్యారెక్టర్ ను ఇంత కంటే గొప్పగా నేను వర్ణించలేను. నిజమైన యోధుల కథలు చెబుతున్నందుకు నాకు గర్వంగా ఉంది. ఇలాంటి పాత్ర నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం వస్తుంది. ఈ మూవీ చాలా గొప్పగా తీసాం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని విక్కీ తెలిపారు.
ఇక రష్మిక మాట్లాడుతూ..‘ ఈ చిత్రంలో మాటలకు అందని భావం ఉంటుంది.. ఓ దైవత్వం ఉంటుంది.. అంతులేని ప్రేమ ఉంటుంది.. అందుకే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఈ సినిమా చూసిన ప్రతీ సారి నేను ఏడ్చేస్తాను. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ పాత్రకు విక్కీ చాలా బాగా సెట్ అయ్యారు.ఆయన పక్కన నిలబడితేనే ఓ మ్యాజిక్ జరుగుతుంది. అందుకే డైరెక్టర్ లక్ష్మణ్ ఈ పాత్రకు విక్కీని సెలెక్ట్ చేశారు’ అని తెలిపింది.