నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు చందూ మొండేటి. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టి తన ప్రతిభను చాటుకున్నాడు. తర్వాత నాగచైతన్యతో ‘ప్రేమమ్’ మూవీ తెలుగులో రిమెక్ చేశాడు అది ఓ మోస్తరు విజయాన్ని సాధిస్తే.. ‘సవ్యసాచి’ మాత్రం డిజాస్టర్ అయింది. దీంతో చందూ టాలెంట్ పై విమర్శలు వచ్చాయి. కానీ ‘కార్తికేయ’ సీక్వెల్ తో మాస్ కమ్ బ్యాక్ ఇచ్చాడు చందూ. ఆ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పుడు ‘కార్తికేయ 2’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘తండేల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ‘తండేల్’ ప్రమోషన్స్ లో భాగంగా చందు మొండేటి ‘కార్తికేయ3’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు..
Also Read:Kartik Aaryan: ముద్దు సీన్ కోసం 37 టేకులు : కార్తీక్ ఆర్యన్
చందు మొండేటి మాట్లాడుతూ..‘ ‘తండేల్’ పని పూర్తి అవ్వగానే ‘కార్తికేయ-3’ మొదలు పెడతాను. ‘కార్తికేయ-2’ సక్సెస్ తర్వాత నా మీద ఎలాంటి బాధ్యత ఉందో నాకు తెలుసు. మీకు మాటిస్తున్నాను పార్ట్ త్రి వేరే స్థాయిలో ఉంటుంది. ఈ మూవీ కోసం నా దగ్గర అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. అలాగే ఈ సినిమా కోసం లొకేషన్ల వేట కూడా పూర్తి చేశాను. నేను కృష్ణుడి గురించి జనాలకు చెప్పాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. మొత్తనికి ‘కార్తికేయ-2తో కృష్ణ భగవానుడు నాకు గొప్ప జీవితాన్ని, కెరీర్‌ను ప్రసాదించాడు. నేనిప్పుడు భక్తి పూర్వకంగా నా కృతజ్ఞతను చాటుకోవాలి. ఈ థర్డ్ పార్ట్ కృష్ణ భగవానుడి చుట్టూనే తిరుగుతుంది. కార్తికేయ-2 చూశాక చాలామంది పిల్లలు కృష్ణుడి గురించి, గోవర్ధన గిరి గురించి పెదవాళ్లను అడిగి తెలుసుకుంటున్నారని తెలిసింది. చాలా సంతోషించాను. నేను మన మూలాలు, సంస్కృతి, పురాణాల మీద మరిన్ని కథలు చెప్పాలనుకుంటున్నా’ అని చందూ తెలిపారు. ప్రజంట్ దర్శకుడి మాటలు వైరల్ అవుతున్నాయి.