VI Anand : హనుమాన్ నిర్మాతతో వి.ఐ.ఆనంద్ మల్టీ స్టారర్
- హనుమాన్ నిర్మాత తో మల్టీస్టారో ప్లాన్ చేసిన విఐ ఆనంద్
- ప్రస్తుతానికి శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు
- ఇద్దరు స్టార్ హీరోల వేటలో దర్శక నిర్మాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VI Anand : యూనిక్ సినిమాలు చేస్తాడనే పేరున్న దర్శకుడు వి.ఐ. ఆనంద్ చివరిగా ఊరి పేరు భైరవకోన సినిమా చేశాడు. ఆ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ క్రమంలో సీక్వెల్ ఎప్పుడు వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. అయితే, ఇప్పుడు ఆయన మరో సోషియో-ఫాంటసీ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కేవలం తెలుగు ఆడియన్స్ కోసం కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు సైలెంటుగా జరుగుతున్నాయి. నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు.
Read Also : Bhairavam : భైరవం ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
Also Read
హనుమాన్ సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించిన నిరంజన్ రెడ్డి, ఆ తర్వాత డార్లింగ్ సినిమా చేశాడు, కానీ అది విజయం సాధించలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడు, అది కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన సాయి ధరమ్ తేజ్ హీరోగా సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నాడు. దానితో పాటు ఈ కొత్త సినిమాపై కూడా దృష్టి పెడుతున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం వారిని ఒప్పించే పనిలో ఉన్నారు. వారు ఒప్పుకున్న తర్వాత అధికారిక ప్రకటనతో సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. వి.ఐ. ఆనంద్‌తో పాటు నిరంజన్ రెడ్డి కూడా తన పరిచయాలను ఉపయోగించి స్టార్ హీరోలను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.
Read Also : Vishwambhara : విశ్వంభర “టెన్షన్లో” ఫాన్స్!
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి