Bhairavam : మోస్ట్ హైప్ ఉన్న రీసెంట్ మూవీల్లో భైరవం ఒకటి. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించారు. ఈ మూవీ మొదటి నుంచి మంచి అంచనాలు బాగానే పెంచుతోంది. ఇప్పటికే వచ్చిన టీజర్, పోస్టర్లు బాగానే ఆకట్టుకున్నాయి ఈ మూవీని మే 30న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఈవెంట్ ను ఏలూరు ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున దీన్ని ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.
Read Also : Patna: గర్ల్‌ఫ్రెండ్ ఫ్లాట్‌కు వచ్చిన బాయ్ ఫ్రెండ్.. ఆమెను ఏం చేశాడంటే?
ముగ్గురు హీరోలు, హీరోయిన్లతో పాటు కీలక పాత్రలు చేసిన వారంతా ఈవెంట్ కు వస్తున్నారు. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్ తో వస్తోంది. ఇప్పటికే హీరోలు ఇంటర్వ్యూతో హైప్ ఇస్తున్నారు. తాజాగా మూవీ ప్రమోషన్లు కూడా జోరుగా ప్లాన్ చేస్తున్నారు. ఇక నుంచి వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఉంటాయంట.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారంట. దానికి స్పెషల్ గెస్ట్ కూడా వచ్చ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతానికి దానిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మనోజ్, రోహిత్ నుంచి సినిమాలు వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. కాబట్టి వీరికి ఈ మూవీ చాలా ప్రత్యేకం. శ్రీనివాస్ కూడా హిట్ కొట్టి చాలా రోజులు అవుతోంది. మరి ఈ మూవీతో హిట్ కొడుతారో లేదో చూడాలి.
Read Also : Patna: గర్ల్‌ఫ్రెండ్ ఫ్లాట్‌కు వచ్చిన బాయ్ ఫ్రెండ్.. ఆమెను ఏం చేశాడంటే?