తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే సూర్య సినిమాలు తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ రాబడతాయి. అందుకు ఉదాహరణలు బోలెడు ఉన్నాయి. సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ గతేడాది రీ రిలీజ్ చేయగా సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుతున్నారు. సూర్య కూడా త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని కంగువ ప్రమోషన్స్ లో తెలిపాడు.
ఇన్నేళ్లకు అభిమానుల కోరిక తీరబోతుంది. ధనుష్ కు సర్, దుల్కర్ కు లక్కీ భాస్కర్ వంటి సూపర్ హిట్స్ అందించిన వెంకీ అట్లూరి ఇప్పుడు సూర్యకు సూపర్ హిట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల సూర్య ను కలిసి కథ కూడా వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూర్య. అలాగే సూర్య సరసన హీరోయిన్ మొదట భాగ్యశ్రీ బోర్స్ ను అనుకోగా ఇప్పడు ఆ ప్లేస్ లోకి గ్లామరస్ డాల్ కయాడు లోహర్ వచ్చి చేరింది. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ డైరక్షన్ లో రెట్రో సినిమా చేస్తున్నాడు సూర్య. ఈ సినిమా షూట్ చివరి దశకు చేరుకుంది. దీంతో వెంకీ అట్లూరి సినిమాను సెట్స్ పైకి ఎక్కించేందుకు రెడీ అయ్యాడు. రానున్న జూన్ నెలలో వెంకీ అట్లూరి సినిమాకు ముహర్తం ఫిక్స్ చేసాడు సూర్య. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తుండగా జీవీ ప్రకాష్ సంగీతం అందించబోతున్నాడు.