Venkatesh: విక్టరీ వెంకటేష్ కు ఫ్యాన్స్ వార్ ఉండవు.. ఆయన అంటే అందరికి అభిమానమే.. టాలీవుడ్ మొత్తానికి ఆయనే వెంకీ మామ. ప్రస్తుతం వెంకీ తన అన్న కొడుకు రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక సినిమాలు విషయం పక్కన పెడితే.. ఇండస్ట్రీలో వివాదాలు లేని హీరో వెంకీ. అయితే షూటింగ్.. లేకపోతే కుటుంబం.. ప్రైవేట్ పార్టీలో కన్పించడం కూడా చాలా తక్కువ. సోషల్ మీడియాలో కూడా చాలా కామ్. యాక్టివ్ గా ఉంటాడు కానీ, ఏది పడితే అది పోస్ట్ చేసి అభిమానులను విసిగించడు. ఇక వెంకీ ఇష్టాయిష్టాలు కూడా చాలా తక్కువమందికి తెలుసు. అయితే తాజాగా వెంకీ ఫేవరేట్ హీరో ఎవరో తెలిసింది. సాధారణంగా ఎంత పెద్ద స్టార్ కి అయినా ఇతర హీరోలు ఖచ్చితంగా ఫేవరేట్ ఉంటారు. ఇక వెంకీకి.. సోగ్గాడు శోభన్ బాబు అంటే చాలా అభిమానం అంట. ఆయనతో కలిసి నటించాలని చాలా ప్రయత్నించారట. కానీ అది కుదరలేదు.
R Narayana Murthy: ఏయ్ పిల్లా.. సభ్యత నేర్చుకో.. యాంకర్ పై సీరియస్ పీపుల్స్ స్టార్
శోభన్ బాబుకు వెంకీ పెద్ద ఫ్యాన్.. ఆయన కోసం ఏకంగా వెంకీ మామ నిర్మాతగా కూడా మారారట. అంతేకాదండీ.. శోభన్ బాబు సినిమాలు నిర్మించడానికి వెంకటేష్ కొత్త ప్రొడక్షన్ హౌస్ ను కూడా స్థాపించాడట.. దానిపేరే వెంకటేష్ ఎంటర్ ప్రైజెస్. ఈ బ్యానర్ లో శోభన్ బాబు నటించిన చిత్రం ‘ఎంకి నాయుడు బావ’. ఈ చిత్రంలో శోభన్ బాబు సరసన వాణిశ్రీ నటించింది. ఈ చిత్రం పూజా కార్యక్రమంలో శోభన్ బాబును వెంకటేష్ కలిశాడు. అప్పటి అరుదైన చిత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా తరువాత వెంకీ.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోయాడట. ఆ తరువాత కలియుగ పాండవులు సినిమాతో ఆయన తెరంగేట్రం అవ్వడం జరిగింది. ఇక సినిమాల్లోకి వచ్చాకా.. శోభన్ బాబుతో కలిసి సినిమా చేసేందుకు ప్రయత్నించాడు కానీ కుదరలేదని టాక్.. అయితే వెంకీ నటించినత్రిమూర్తులు సినిమాలో శోభన్ బాబు ఒక సాంగ్ లో కనిపిస్తారు. నిజం చెప్పాలంటే.. తెలుగు హీరోలందరూ ఒక సాంగ్ లో కనిపించిన ఏకైక సాంగ్ అది. ఏది ఏమైనా తన ఫేవరేట్ హీరో కోసం 18 ఏళ్లకే వెంకీ నిర్మాతగా మారడం మాత్రం నిజంగా గర్వించదగ్గ విషయమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.