2023 సంక్రాంతి బరిలో నిలవనున్న సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’, ‘వారిసు’. చిరు, బాలయ్య, విజయ్ నటిస్తున్న ఈ సినిమాల ప్రమోషన్స్ ని ఆయా చిత్ర యూనిట్లు ఇప్పటికే మొదలుపెట్టాయి. ఈ మూడు సినిమాల్లో ముందుగా విజయ్ నటించిన ‘వారిసు’ నుంచి ‘రంజితమే’ సాంగ్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్ అయ్యింది. రంజితమే సాంగ్ ని ఉన్న రిపీట్ వేల్యూ ఈ మధ్య కాలంలో ఏ పాటకి రాలేదంటే ‘వారిసు’ సినిమా కోసం తమన్ చేసిన మ్యాజిక్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇన్స్టాంట్ బ్లాక్ బస్టర్ అయిన ‘రంజితమే’ సాంగ్ ‘వారిసు’ సినిమాకి మంచి ప్రమోషనల్ స్టఫ్ అయ్యింది.
సంక్రాంతి బరిలో ఉండి ప్రమోషన్స్ ని సాంగ్ తో గ్రాండ్ గా మొదలుపెట్టిన రెండో సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మెగాస్టార్ చిరంజీవి మాస్ గెటప్ లోకి మారి చేస్తున్న ఈ సినిమా నుంచి ‘బాస్ పార్టీ’ అంటూ ఫస్ట్ సాంగ్ బయటకి వచ్చింది. దేవి లిరిక్స్ రాసి, కంపోజ్ చేసిన ఈ సాంగ్ యుట్యూబ్ ని షేక్ చేస్తోంది. ‘బాస్ ఈజ్ బ్యాక్ ఇన్ మాస్’ అంటూ మెగా అభిమానులని ఒక్కసారిగా అలర్ట్ చేసిన ‘బాస్ పార్టీ’ సాంగ్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాపై అంచనాలని అమాంతం పెంచేసింది. ఇలా సంక్రాంతి బరిలో ఉన్న వారిసు, వాల్తేరు వీరయ్య సినిమాలు ఫస్ట్ సాంగ్ తోనే సిక్సర్ కొట్టి ప్రమోషన్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేశాయి. ఇక ఈ పార్టీలో లేట్ గా జాయిన్ అవ్వనున్నాడు బాలయ్య. నటసింహం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’ నుంచి ఫస్ట్ సాంగ్ ‘జై బాలయ్య’ మరి కొన్ని గంటల్లో బయటకి రానుంది. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా బాలకృష్ణకి ఇప్పటికే ‘అఖండ’ లాంటి సూపర్ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు అదే రేంజులో ‘జై బాలయ్య’ సాంగ్ కూడా ఇస్తే, వీర సింహా రెడ్డి సినిమా ప్రమోషన్స్ కి సూపర్బ్ స్టార్ట్ దొరికేసినట్లే.