మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకపక్క రామ్ చరణ్ కు భార్యగా, మెగా ఫ్యామిలీ కి కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోపక్క అపోలో హాస్పిటల్స్ కు వైస్ ఛైర్మెన్ గా, సోషల్ యాక్టివిస్టు గా ఆమె నిరంతం సేవలు అందిస్తూనే ఉన్నారు. ఇక ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించేలా చేయడం ఉపాసన పెద్ద డ్రీమ్. అందుకోసం ఆమె నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. పలు సేవా కార్యక్రమాలను చేపట్టి ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక మన దేశంలోనే కాకుండా ఆమె సేవలు విదేశాల వరకు పాకాయి.
విదేశాల్లోని తెలుగు ప్రజలకు ఆమె చేస్తున్న సాయం మాటల్లో చెప్పలేనిది. అబ్రాడ్ లో ఉన్న తెలుగు ప్రజలకు తమ హాస్పిటల్లో తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తుంది. అంతేకాకుండా వారికి ఏదైనా అత్యవసర చికిత్స చేయాల్సివచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యి తనవంతు సాయం అందిస్తుందని ప్రవాస భారతీయులు ఉపాసన మంచితనాన్ని చెప్పుకొస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలతో ఉపాసన తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొడుతోంది. ఒక స్త్రీ శక్తి, మానవత్వం గలిగిన మనిషి అంటూ ఉపాసనను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు.. మెగా కోడలా మజాకానా. భర్త పేరును, మామ కుటుంబ పరువును నిలబెడుతుంది.. మెగా కోడలు మనసు వెన్న అంటూ కామెంట్స్ పెడుతున్నారు.